లక్ష్యం.. శతశాతం | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం.. శతశాతం

Published Fri, Jan 31 2025 12:47 AM | Last Updated on Fri, Jan 31 2025 12:46 AM

లక్ష్

లక్ష్యం.. శతశాతం

వివరాలు 8లో u

పరీక్షలంటే భయం పోయింది..

పాఠశాలలో నిత్యం ఇస్తున్న మాదిరి ప్రశ్నపత్రాలనుచదువుతూ వాటికి జవాబులు రాస్తున్నాం. అంతేగాకుండా ప్రతినెల అన్ని సబ్జెక్టుల పరీక్షలు నిర్వహిస్తుండటం.. విధిగా హాజరవుతుండటంతో పరీక్షలంటే భయం వీడింది. ఈసారి వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించడమే లక్ష్యంగా చదువుతున్నా.

– మౌనిక, విద్యార్థిని,

జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, అమరచింత

అమరచింత: పదోతరగతి వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యాధికారులు తమ మండలాల్లోని పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. శతశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రోజువారీ తరగతులతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే సబ్జెక్టుల వారీగా స్లిప్‌టెస్టులు నిర్వహించి చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అర్థమయ్యేలా తిరిగి బోధిస్తున్నట్లు ఉపాధ్యాయులు వివరించారు.

పరీక్షలంటే భయం వీడేందుకు..

విద్యార్థులు పరీక్షలంటే భయం వీడేందుకు, ఇష్టంతో హాజరయ్యేలా సీఆర్టీలు ప్రత్యేక చొరవ చూ పుతున్నారు. నిత్యం స్లిప్‌ టెస్ట్‌లు నిర్వహించడం, పరీక్షల మోడల్‌ పేపర్లు అందించి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. నెలలో బోధించిన పాఠాల వారీగా ప్రశ్నలు తయారుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఐదు నెలలుగా కొనసాగుతోంది. వీటిని ప్రతి నెలా నిర్వహించాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది.

ఆకస్మిక తనిఖీలతో..

పదోతరగతి విద్యార్థులకు కొనసాగుతున్న ‘లక్ష్య’ కార్యక్రమ పరిశీలనకు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో వారి దృష్టికి వచ్చిన సమస్యలను అప్పటికప్పుడే సరిచేస్తూ నాణ్యమైన విద్య అందించేలా ముందుకు సాగుతున్నారు.

‘పది’లో ఉత్తమ ఫలితాల సాధనకు కసరత్తు

జిల్లాలో 6,885 మంది విద్యార్థులు

ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో

ప్రత్యేక తరగతులు

సబ్జెక్టుల వారీగా స్లిప్‌ టెస్ట్‌లు

వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ

అర్థమయ్యేలా బోధన..

ఉపాధ్యాయులు రోజు తరగతి గదిలో విషయాలు అర్థమయ్యేలా బోధిస్తున్నారు. అర్థం కాని వాటి గురించి అడిగితే మరోసారి చెబుతున్నారు. గణితం, ఆంగ్లం, సైన్స్‌ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో చక్కగా అర్థమవుతున్నాయి. స్లిప్‌ టెస్ట్‌ల నిర్వహణతో సబ్జెక్టులపై ఆసక్తి పెరిగింది.

– శిరీష,

జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, అమరచింత

ఉత్తమ ఫలితాల సాధనకు..

పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనే ‘లక్ష్య’ అనే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తున్నాం. అంతేగాకుండా చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. విద్యార్థుల్లో పరీక్షలంటే భయం పోగొట్టేందుకు ప్రేరణ తరగతులు నిర్వహించాం. జిల్లాలోని అన్ని పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.

– అబ్దుల్‌ ఘని, జిల్లా విద్యాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
లక్ష్యం.. శతశాతం 1
1/4

లక్ష్యం.. శతశాతం

లక్ష్యం.. శతశాతం 2
2/4

లక్ష్యం.. శతశాతం

లక్ష్యం.. శతశాతం 3
3/4

లక్ష్యం.. శతశాతం

లక్ష్యం.. శతశాతం 4
4/4

లక్ష్యం.. శతశాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement