వనపర్తి పుర కమిషనర్ బదిలీ
వనపర్తి టౌన్: వనపర్తి పుర కమిషనర్ పూర్ణచందర్ చేవెళ్లకు బదిలీ అయ్యారు. గతేడాది ఫిబ్రవరి 24న బాధ్యతలు చేపట్టిన ఆయన 11 నెలల 6 రోజులు జిల్లాకేంద్రంలో విధులు నిర్వర్తించారు. కమిషనర్ పాలకవర్గానికి సహకరించడం లేదని, ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని ఆరోపిస్తూ మూడు నెలల కిందట సీడీఎంఏకు సరెండర్ చేస్తూ కౌన్సిల్‌లో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అలాగే కలెక్టర్, సీడీఎంఏ, ఎమ్మెల్యే మేఘారెడ్డికి వినతిపత్రాలు అందించారు. ఎట్టకేలకు పాలకవర్గం గడువు ముగిసిన నాలుగు రోజుల తర్వాత కమిషనర్ బదిలీ కావడం గమనార్హం.
ముగిసిన
పాత సామగ్రి వేలం
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు జిల్లా పోలీస్ కార్యాలయం ఏఓ సునందన ఆధ్వర్యంలో పాత జనరేటర్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, ఐరన్ బీరువాలు, ర్యాక్‌లు, మంచాలు, బెంచీలు, కుర్చీలు, ఫైబర్ కుర్చీలు, కలప టేబుళ్లు, పాత టెంట్లు, బ్యాటరీలు తదితర పాత సామగ్రి వేలం నిర్వహించారు. వేలంలో 35 మంది పాటదారులు పాల్గొన్నారు. నిబంధనల మేరకు పారదర్శకంగా వేలం నిర్వహించగా జిల్లాకేంద్రానికి చెందిన కరీం రూ.1.33 లక్షలకు దక్కించుకున్నట్లు డీసీఆర్బా డీఎస్పీ వివరించారు. వేలం పాటలో రిజర్వ్ సీఐలు శ్రీనివాస్, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ శివకుమార్, కమ్యూనికేషన్ ఎస్‌ఐ అతీక్, రిజర్వ్ ఎస్‌ఐలు వినోద్, సురేందర్, మొగ్దుం. జిల్లా పోలీసు కార్యాలయం స్టోర్ అసిస్టెంట్లు సుదర్శన్, భరత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ప్రతిఘటనే
శరణ్యం : సీపీఐ
వనపర్తి రూరల్: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లకే పరిమితం కావడంతో ప్రధాని మోదీ దూకుడు తగ్గిస్తారని భావించినా వెనక్కి తగ్గడం లేదని, ప్రజా ప్రతిఘటనే శరణ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సొంత మెజార్టీ లేకున్నా జమిలి ఎన్నికల చట్టం తీసుకొచ్చారని, వివాదాస్పద వక్స్ బోర్డు చట్టంపై సెలెక్టు కమిటీ ఆమోదముద్ర వేసిందన్నారు. మావోయిస్టు ప్రభావిత అటవీ ప్రాంతాల్లో ఉన్న గనులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని.. అంబేడ్కర్ ఆలోచన విధానంపైనే వ్యతిరేకత, మను సంస్కృతి అమలు చేయాలన్న బలమైన ఆకాంక్షతో ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో రూ.రెండు లక్షల పంట రుణమాఫీ కాలేదని.. వెంటనే పూర్తి చేయాలని కోరారు. రైతు భరోసా నిధులను ఏకకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఇందిరమ్మ ఇళ్లు ఇతర సంక్షేమ పథకాలు అర్హులకే ఇవ్వాలని, కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గ్రామాల్లోని సమస్యలను గుర్తించి పరిష్కారానికి పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, నాయకులు మోషా, గోపాలకృష్ణ, సీఎన్ శెట్టి, శ్రీరామ్, రమేశ్, అబ్రహం, రాబర్ట్, భాస్క ర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
బకాయిలు విడుదల చేయాలని వినతి
వనపర్తి విద్యావిభాగం: విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయి నిధులు వెంటనే విడుదల చేయాలని గురువారం బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్‌ఎఫ్) నాయకులు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాలుగేళ్లుగా విద్యార్థులకు ఇవ్వాల్సిన సుమారు రూ.8 వేల కోట్ల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు నేటికీ విడుదల చేయకపోవడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందని.. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పూర్తి బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి తోలు రాము, రాజేష్, శివ, గౌతమ్, నరేశ్, జమ్మన్న, ప్రసాద్, శివశంకర్, జశ్వంత్, యశ్వంత్, సిద్ధార్థ, రాజేందర్, అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment