గ్రామాల్లో తాగునీటి సమస్యలు రానివ్వొద్దు
వనపర్తి: జిల్లాలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీఈలు, ఏఈలతో వెబెక్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పది రోజులపాటు గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని.. స్థానికంగా ఉన్న బోర్లు, మోటార్లు మరమ్మతులు చేయించడం, లీకేజీలను సరి చేయడం పనులు చేయించాలన్నారు. సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా తాగు నీటి వృథాను అరికట్టి, నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డీపీఓ సురేశ్‌కుమార్, మిషన్ భగీరథ ఈఈ మేఘారెడ్డి, డీఎల్పీఓ రఘునాథ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment