వరంగల్ : స్టయిఫండరీ క్యాండెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల రాత పరీక్ష ఆదివారం జరగనుందని, ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. పరీక్ష నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు, అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలను శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాత పరీక్ష కోసం వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 16 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లానుంచి పరీక్షకు 12,040 మంది అర్హత సాధించారని వివరించారు.
అభ్యర్థులకు సూచనలు..
► నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు.
► హాల్ టికెట్‌ను పరీక్ష కేంద్రం, హాల్‌లో చూపిస్తేనే లోపలికి అనుమతి ఉంటుంది.
► పరీక్ష కేంద్రానికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు, బ్యాగులను తీసుకురావద్దు.
► పోలీస్ నియామకబోర్డు జారీ చేసిన హాల్‌టికెట్, బ్లాక్, బ్లూపెన్, అధార్, డ్రైవింగ్, ఓటర్ గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకురావాలి.
► అభ్యర్థుల గుర్తింపును పరీక్ష కేంద్రాల వద్ద పూర్తిగా పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతిస్తారు.
► పరీక్ష ప్రారంభమైన తరువాత అభ్యర్థులను హాల్‌లోకి అనుమతించరు. లోపల ఉన్న వారిని పరీక్ష పూర్తయ్యేవరకు బయటకు పంపించరు.
► అభ్యర్థులు గంట ముందుగా తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలి.
► పరీక్ష రాసే ముందు అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌ను పూర్తిగా చదువుకోవాలి.
► ఓఎంఆర్‌షీట్‌పై అనవసరపు గుర్తులు, మతపరమైన గుర్తులు, ఏమైనా రాస్తే ఆ ఓఎంఆర్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోరు.
► అభ్యర్థులు అనైతిక చర్యలకు పాల్పడితే.. వారి ఓఎంఆర్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోరు.
► ఒక అభ్యర్థికి బదులు మరో అభ్యర్థి పరీక్ష రాస్తే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయి.
► అభ్యర్థుల ఫొటోలు, వేలిముద్రలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
► మెహందీ, సిరా వంటి వాటిని చేతులకు, పాదాలకు పెట్టుకోకూడదు.
► ప్రశ్నపత్రం అభ్యర్థులకనుగుణంగా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు 16..
అభ్యర్థులు 12,040 మంది
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్
Comments
Please login to add a commentAdd a comment