హన్మకొండ కల్చరల్: చారిత్రక కట్టడాలు, చరిత్ర మరుగున పడిపోకుండా కాపాడుకోవాలని భవిష్యత్ తరాలకు చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం వేయిస్తంభాల ఆలయాన్ని లక్ష్మీనారాయణ దంపతులు సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్‌కుమార్, అర్చకులు జస్టిస్‌ను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. స్వామివా రికి సహస్రనామార్చన నిర్వహించుకున్న అనంతరం గంగు ఉపేంద్రశర్మ వారికి తీర్థప్రసాదాలను, శేషవస్త్రాలను, మహదాశీర్వచనం అందజేసి ఆలయ ప్రాశస్థ్యాన్ని వివరించారు. వారు ఆలయ పరిక్రమ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆలయ శిల్ప సంపదను, కల్యాణ మండపాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌బాబు, ఆర్డీఓ నారాయణ, తహసీల్దార్ శ్రీపాల్‌రెడ్డి, మట్టెవాడ పోలీసులు, దేవాలయ సిబ్బంది మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
భద్రకాళి దేవాలయం సందర్శన
రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ దంపతులు భద్రకాళి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు ఆయనను స్వాగతించారు. జస్టిస్ దంపతులు ఆదిశంకరులను, వల్లభ గణపతిని దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అర్చకులు మహదాశీర్వచనం అందజేశారు.
హైకోర్టు జడ్జి జస్టిస్
అలిశెట్టి లక్ష్మీనారాయణ
రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు