సోదర భావాన్ని పెంపొందించేది ఇఫ్తార్
● డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ
వర్ధన్నపేట: ఇఫ్తార్ విందులు సోదరభావాన్ని పెంపొదిస్తాయని, రంజాన్ పవిత్ర మాసంలో ముస్లింలు ఎంతో నిష్టతో ఉపవాస దీక్షలు చేస్తారని డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణరాజేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం రాత్రి వర్ధన్నపేట పట్టణంలోని జమామసీదులో ముస్లింలకు ఎర్రబెల్లి స్వర్ణరాజేశ్వర్‌రావు దంపతులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముస్లింలకు అండగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఉంటుందన్నారు. మైనార్టీ సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సెక్యులర్ పార్టీయేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు ఎండీ అప్సర్, ఎండీ అన్వర్, అజీజ్, జలీల్, అఫ్జల్, సలీం, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment