
హిందూ ధర్మాన్ని కాపాడాలి
నర్సంపేట: హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి యువకుడు కంకణబద్ధుడై హనుమంతుడిలా పనిచేయాలని జగద్గురు శ్రీకాంతేంద్రస్వామి పిలుపునిచ్చారు. విశ్వహిందూ పరిషత్–బజరంగ్‌దళ్ నర్సంపేట ప్రఖండ బాధ్యులు శనివారం సాయంత్రం నర్సంపేటలో వీరహనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంతేంద్రస్వామి మాట్లాడుతూ హైందవ ధర్మం కోసం హనుమంతుడు, రామలక్ష్మణులు పనిచేశారని గుర్తు చేశారు. ధర్మం కోసం హనుమంతుడు లంకను సైతం తగులబెట్టిన సందర్భాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులు భగవద్గీతను తప్పకుండా చదవాలని సూచించారు. శోభాయాత్రలో 1000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారని తెలిపారు. నర్సంపేటలోని అయ్యప్పస్వామి ఆలయంలో ప్రారంభమైన శోభాయాత్ర సర్వాపురంలోని హనుమాన్ దేవాలయం వరకు కొనసాగింది. విశ్వహిందూ పరిషత్ నర్సంపేట ప్రఖండ కార్యదర్శి వేల్పుల శ్రీధర్, అధ్యక్షుడు చొల్లేటి జగదీశ్, ఆర్‌ఎస్‌ఎస్ నర్సంపేట సంఘచాలకులు మోతె సమ్మిరెడ్డి, విశ్వహిందూ పరిషత్ జిల్లా సహ కార్యదర్శి మల్యాల రవి, వేల్పుల శ్రీధర్, శోభన్, రవీందర్‌శర్మ, శివకుమార్, భూషబోయిన వెంకటేశ్, దేవేందర్, చరణ్, వీరన్న, క్రాంతికుమార్, రాజేందర్, రాజు, భీంరాజ్, హరీశ్‌కుమార్, ముస్కు రాజేందర్, అరవింద్, శ్రీకాంత్, సుదర్శన్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
జగద్గురు శ్రీకాంతేంద్రస్వామి
నర్సంపేట పట్టణంలో
వీర హనుమాన్ శోభాయాత్ర

హిందూ ధర్మాన్ని కాపాడాలి