తణుకులో అనుచరులతో సమాలోచనలు చేస్తున్న జనసేన ఇన్‌చార్జి విడివాడ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో టికెట్ ప్రకంపనలు మొదలయ్యాయి. నమ్మక ద్రో హం చేశారని ఒకరు, కోట్లు ఖర్చు పెట్టించి గొంతు కోశారని మరోనేత తీవ్ర స్థాయిలో అసమ్మతి గళం విప్పడంతో ఉండి, తణుకు నియోజకవర్గాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. టికెట్లు ఆశించి భంగపడిన ఇద్దరు ఆశావహులు కూడా అనుచరులతో సమావేశమై స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉంటామని ప్రకటించి టీడీపీ, జనసేనలకు అల్టిమేటం ఇవ్వడంతో రెండు నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణా లు, పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉండిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, తణుకులో జనసేన ఇన్‌చార్జి విడివాడ రామచంద్రరావు అసమ్మతి స్వరం హెచ్చుస్థాయి లో వినిపించడం చర్చగా మారింది. టీడీపీ, జనసేన తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో టికెట్ రాక భంగపడిన నేతలు విరుచుకుపడుతున్నారు.
ఉండిలో వేరు కుంపట్లు
ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు టికెట్ బలంగా ఆశించి ఐదేళ్లుగా పార్టీ ఎమ్మెల్యేతో కలిసి కొంతకాలం, విడిపోయి సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా అందరూ టికెట్ ఇస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో నియోజకవర్గమంతా విస్తృతంగా పర్యటించడంతోపాటు సొంత స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించి జనాల్లో ఉన్నారు. వరుసగా 2009, 2014లో ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2019 ఎన్నికల సమయంలో నరసాపురం పార్లమెంట్ సీటుకు మంచి అభ్యర్థిని చూడమంటే వేటుకూరి శివరామరాజు తన అనుచరుడిగా తిరిగే మంతెన రామరాజును చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి టికెట్ ఇస్తే గెలుపించుకుంటామని స్పష్టం చేశారు.
దీంతో సరైన విద్యార్హత లేని వ్యక్తిని పార్లమెంట్‌కు ఎలా పంపిస్తామని చెప్పిన క్రమంలో వేటుకూరి శివరామరాజు నరసాపురం నుంచి ఎంపీగా, మంతెన రామరాజు ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేయగా వేటుకూరి ఎంపీగా ఓడిపోయి, మంతెన ఎమ్మెల్యేగా గెలిచారు. తదనంతర పరిణామాల్లో వేటుకూరి కార్యాలయంలోనే ఉండి నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని నిర్వహించే ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో వేరు కుంపట్లు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. 2019లో రామరాజు అభ్యర్థిత్వం ఖరారైనప్పుడే ఒక్క పర్యాయం మాత్రమేనని పార్టీ వద్ద మంతెనతోనూ ఒప్పందం జరిగిందని ఇప్పుడు మళ్లీ టికెట్ శివరామరాజుకు నిరాకరించి మంతెనకే ఇవ్వడంపై వేటుకూరి వర్గం మండిపడుతుంది.
పరిశీలకుడికి చుక్కెదురు
తొలి జాబితాలో మొండిచేయి చూపడంతో ఆదివారం అనుచరులతో శివరామరాజు సమావేశమయ్యారు. అక్కడికి టీడీపీ నియోజకవర్గ పరిశీలకు డు కొత్త నాగేంద్రకుమార్‌వచ్చి వేటుకూరికి సర్దిచె ప్పే ప్రయత్నం చేస్తుండటంతో కేడర్ తిరగబడి ఘో రావ్ చేసి గందరగోళం సృష్టించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెండు రోజుల్లో అనుచరులందరి అభీష్టం మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తానని, అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా అయినా తప్పనిసరిగా పోటీలో ఉంటానని శివరామరాజు ప్రకటించడంతో నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment