ఇన్‌కం ట్యాక్స్‌లో మార్పులపై అవగాహన అవసరం
ఏలూరు (టూటౌన్): ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఇన్‌కం ట్యాక్స్‌లో చాలా మార్పులు వస్తున్నాయని, దీనిపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని విశాఖపట్నం ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్ బి.శ్రీనివాస్ అన్నారు. ఏలూరు డివిజన్ ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో స్థానిక అతిథి హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన హాజరై మాట్లాడారు. ఇంట్లో నుంచే రిటర్న్స్ దాఖలు చేసే అవకాశం ఏర్పడిందన్నారు. మార్చి 15 లోపు అడ్వాన్స్ ట్యాక్స్‌లు చెల్లించాలని గుర్తుచేశారు. ఆదాయ పన్ను సక్రమంగా చెల్లించినవారికి తమ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులూ ఉండవన్నారు. సదస్సులో రాజమహేంద్రవరం అడిషనల్ కమిషనర్ డి.హేమ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment