
రాజబాబు మృతి పార్టీకి తీరని లోటు
ద్వారకాతిరుమల: చివరి నిమిషం వరకు పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబును పార్టీ శ్రేణులు ఆదర్శంగా తీసుకోవాలని ఆ పార్టీ మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలో శనివారం నిర్వహించిన రాజబాబు సంతాప సభలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ హోం మంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, పార్టీ కొవ్వూరు, ఉంగుటూరు, చింతలపూడి ఇన్‌చార్జిలు తలారి వెంకట్రావు, పుప్పాల వాసుబాబు, కంభంపాటి విజయరాజు, వైఎస్సార్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్, విశాఖపట్నం స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు(జీవీ), పార్టీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, ఏలూరు మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్‌బాబు, నగర బీసీ సెల్ అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, చేనేత విభాగ మాజీ అధ్యక్షుడు కొల్లిపార సురేష్, గుడివాక మోహన్ తదితరులు రాజబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ కోసం రాజబాబు అహర్నిశలు శ్రమించారని, ఆయన లేని లోటు తీరనిదని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఎమ్మార్డీ బలరాం, ఏలూరు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కంచెన రామకృష్ణ, ఏలూరు డిప్యూటీ మేయర్ పప్పు ఉమ, మాజీ గ్రంథాలయ చైర్మన్ పాకలపాటి గాంధి, మాజీ జెడ్పీటీసీ డీవీఎస్ చౌదరి, నరహరిశెట్టి రాజా, వెల్లంకి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

రాజబాబు మృతి పార్టీకి తీరని లోటు
Comments
Please login to add a commentAdd a comment