
సివిల్ సర్వీసెస్ యోగా పోటీలకు ఎంపిక
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి నుంచి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ యోగ చాంపియన్ షిప్ 2024–2025కు ఇరపా అమ్మాజీ ఎంపికై నట్లు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల తెలిపారు. జాతీయ స్థాయి యోగాసన పోటీలు ఈ నెల 5వ తేదీ నుంచి చండీఘర్‌లో నిర్వహిస్తారన్నారు. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 32 మంది ఉద్యోగులు ఎంపిక కాగా, వారిలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి చీఫ్ ఫార్మసీ ఆఫీసర్ ఇరపా అమ్మాజీ (అమూల్య) ఎంపికై నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మాజీకి జిల్లా అధికారులు, మెడికల్ సూపరింటెండెంట్ డా. సీహెచ్ బేబీ కమలతో పాటు ఆసుపత్రి సిబ్బంది అభినందనలు తెలిపారు.
బలివేలో శివరాత్రి ఉత్సవాల ఆదాయం రూ.40.40 లక్షలు
బలివే(ముసునూరు): మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా బలివే రామలింగేశ్వర స్వామి ఆలయానికి రూ.40 లక్షల 40 వేల 674 ఆదాయం లభించినట్లు ఈఓ పామర్తి సీతారామయ్య తెలిపారు. శుక్ర, శనివారాల్లో ఆలయం వద్ద ఉత్సవాల అధికారి అనూరాధ పర్యవేక్షణలో హుండీలు, ఇతర ఆదాయాల లెక్కింపు నిర్వహించారు. ప్రత్యేక దర్శనాలు, శీఘ్ర దర్శనాలు, తొలి అభిషేకం, ప్రత్యేక అభిషేకాలు తదితర పూజాధికాల ద్వారా రూ.9,54,62, విరాళాల రూపంలో రూ.2,68,098, ఖాళీ స్థలాల్లో తాత్కాలిక దుకాణాల ఏర్పాటు ద్వారా రూ.13,10,000, కొబ్బరి చిప్పల విక్రయం ద్వారా రూ.1,30,000, శాశ్వత, తాత్కాలిక హుండీల ద్వారా రూ.13,77,951 ఆదాయం లభించినట్లు తెలిపారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది స్వామి వారికి సుమారు రూ.లక్ష మేర ఆదా యం తగ్గిందన్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్ రావు ప్రవీణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

సివిల్ సర్వీసెస్ యోగా పోటీలకు ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment