తాడేపల్లిగూడెం రూరల్: భూములకు కచ్చితమైన హద్దులు గుర్తించేలా ప్రయోగాత్మకంగా రీ–సర్వే జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. తాడేపల్లిగూడెంలో నవాబుపాలెంలో రీ–సర్వే గ్రౌండ్ ట్రూతినింగ్ పనులను, సరిహద్దుల మ్యాప్‌లను శనివారంఆమె పరిశీలించారు. రైతులు భూములకు ఖచ్చితమైన హద్దులు గుర్తించి ప్రయోగాత్మకంగా రీ–సర్వే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సర్వే నిర్వహించే ముందు భూ యజమానులకు సమాచారం అందించాలన్నారు. వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని సూచించారు. రైతులు అభ్యంతరాలను ప్రామాణికంగా తీసుకొని వాటిని నివృత్తి చేయాలన్నారు. దస్తావేజులు తప్పులుంటే సరి చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ లే అవుట్ కాలనీ లబ్ధిదారులతో మాట్లాడారు. దశల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మంచినీటి సదుపాయానికి ఆర్‌డబ్ల్యుఎఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గర్భవతులు, చిన్నారుల్లో రక్తహీనత లేకుండా చూడాలన్నారు. వివిధ రకాల క్యాన్సర్లు గుర్తించడానికి చేస్తున్న సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment