
భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి ఆలయం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో దూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో క్షేత్ర పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, అనివేటి మండపం, కల్యాణకట్ట ఇలా అన్ని విభాగాలు భక్తులతో పోటెత్తాయి. స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు అన్నదాన భవనం వద్ద బారులు తీరారు. భక్తుల వాహనాలతో పార్కింగ్ ప్రదేశాలు నిండిపోయాయి.

భక్తులతో కిటకిటలాడిన శ్రీవారి ఆలయం
Comments
Please login to add a commentAdd a comment