భూకంపం..అప్రమత్తంచేద్దాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: భూకంపాలపై దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే భూకంపం ఎలా వస్తుంది.. ఎప్పుడు వస్తుంది.. ఎందుకు వస్తుంది.. ఎంత తీవ్రతతో వస్తుంది.. అన్న ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు లేవు. ఒక్కో దశను పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రపంచంలో అభివృద్ధి చెందిన అతి కొద్ది దేశాల్లో 30 నుంచి 40 సెకన్లు ముందుగా చెప్పే వ్యవస్థను మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. మన దేశంలో అయితే అటువంటి వ్యవస్థ కూడా లేదు. తుపాను ప్రభావిత ప్రాంతాలను వాతావరణ శాఖ ముందుగా గుర్తించి ఎలా సమాచారం అందిస్తుందో అదే తరహాలో భూకంపాలను ముందుగా అంచనా వేసే టెక్నాలజీపై ఏలూరు నగరానికి చెందిన ఇంజనీర్ చేసిన పరిశోధనలు తుది అంకానికి చేరుకున్నాయి.
2004 నుంచి శోధన
19 ఏళ్ల పరిశోధనలు పలు అవాంతరాలు, అవరోధాలను దాటుకుని ఆరేళ్లుగా భూకంపాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన డేటాను ముందస్తుగా అంటే కనీసం వారం నుంచి నెల రోజుల ముందు గుర్తించే సరికొత్త టెక్నాలజీని సిద్ధం చేశారు ఏలూరుకు చెందిన మరడాని శివ సీతారామ్. అన్ని ప్రయోగ దశలూ పూర్తి చేసుకుని తుది దశ పరీక్షల్లో ఉన్నారు. ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏడున్నరేళ్ల పాటు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నెట్‌వర్కింగ్‌పై పనిచేశారు. ప్రస్తుతం భూకంపాల రీసెర్చ్‌ని హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిస్తున్నారు. 2004 నుంచి భూకంపా లు, సునామీలను గుర్తించడం ఎలా అనేదానిపై పరి శోధన ప్రారంభించి సరికొత్త విధానాన్ని రూపొందించారు. దాదాపుగా ఆరేళ్ల నుంచి ట్విట్టర్, www.seismo.in వెబ్‌సైట్‌లో ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్, ఇథియోపియా, ఆప్ఘనిస్తాన్, నేపాల్, టిబె ట్, ఇండియాలో భూకంపాలకు సంబంధించిన సమగ్ర డేటాను పొందుపరిచారు. 2004 నుంచి దాదాపుగా 300కు పైగా భూకంపాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించి 2020 నుంచి మాత్రమే పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
20 రకాల పద్ధతులతో..
ప్రపంచవ్యాప్తంగా 20 రకాల పద్ధతుల్లో భూకంపా లను అంచనాలు వేస్తున్నారు. టెక్నాలజీలో అభివృద్ధి చెందిన జపాన్, తైవాన్, మెక్సికో, అమెరికా, ఉమేనియా, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు భూమిలో అమర్చిన సెన్సార్ ద్వారా 30 నుంచి 40 సెకన్ల ముందు పసిగట్టే వ్యవస్థను అందుబాటులో పెట్టారు.
భూకంప కేంద్రం నుంచి మార్పులు గుర్తిస్తూ..
శివ సీతారామ్ పరిశోధనలు చేసిన ఫలితాన్ని తుది దశకు తీసుకువచ్చారు. సమయం, ప్రదేశం, తీవ్ర తను వారం నుంచి నెల రోజుల పాటు ముందస్తు గా అంచనా వేయగలుగుతున్నారు. అలా ముంద స్తు అంచనాలతో సిద్ధం చేసిన సమాచారాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. 7 మ్యాగ్నిట్యూడ్ కంటే ఎక్కువ తీవ్రత ఉండే భూకంపాలు రావడానికి ముందు సుమారు 3 నుంచి 6 నెలల పాటు భూమి లోపల పొరల్లో వివిధ రకాల సంకేతాలు అందుతుంటాయి. దాని ప్రభావం 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనిని బట్టి ప్రదేశం, సమయం, తీవ్రత ఈ మూడు అంశాల్లో కచ్చిత త్వాన్ని అంచనా వేయగలిగితేనే ఆస్తి, ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. దీనిపైనే శివ పరిశోధనలు చేసి సూక్ష్మస్థాయి మార్పులు భూకంప కేంద్రం నుంచి కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయని గుర్తించారు. వీటిని కొన్ని పద్ధతుల్లో నిర్విరామంగా పర్యవేక్షించి అంచనా వేస్తున్నారు. ఇలా 2025 జన వరిలో టిబెట్‌లో 7.1 మ్యాగ్నిట్యూడ్, 2024 జనవరిలో జపాన్‌లో 7.6 మ్యాగ్నిట్యూడ్, 2023 నవంబరులో నేపాల్‌లో 6.3 మ్యాగ్నిట్యూడ్ లాంటి భూకంపాల నమోదు డేటాతో పాటు సుమారు 20 చోట్ల జరిగిన నష్టం తీవ్రత పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు.
19 ఏళ్లుగా భూకంపాలను పసిగట్టే పరిశోధనలు
వారం నుంచి నెల రోజులు ముందుగా గుర్తించేలా ప్రయోగాలు
తుది దశకు చేరిన అంకం
ఆరేళ్లుగా వెబ్‌సైట్‌లో భూకంపాల డేటా
ఏలూరుకు చెందిన ఇంజనీర్ శివ సీతారామ్ సరికొత్త ఆవిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment