
ట్రెజరీ సంఘ ఎన్నికలు ఏకగ్రీవం
భీమవరం (ప్రకాశంచౌక్) : భీమవరం ట్రెజరీ కార్యాలయంలో ఆదివారం ట్రెజరీస్, అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎ న్నికలు నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా జె.రామారావు, ఎం.సత్యనారాయ ణ, సహాధ్యక్షుడిగా కేఎంకే హనుమంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వీఎస్‌ఎస్ శ్రీనివాస్, ఎన్.సీతారామయ్య, డి.పుష్పలత, ఎం.సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.నరేంద్రరాజు, జాయింట్ సెక్రటరీలుగా డి.నాగభూషణం, జె.తిరుపతిరెడ్డి, వి.శారద దేవి, ట్రెజరర్‌గా పి.కొండలరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి షేక్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. సంఘం సభ్యుల పురోభివృద్ధికి పాటుపడుతూ త్వరలోనే అన్ని జిల్లాల ఎన్నికలు పూర్తిచేసుకుని రాష్ట్ర సంఘ ఎన్నికలకు వెళతామని నాయకులు తెలిపారు.
మత్స్యకారుల సమస్యలపై మంత్రికి వినతి
భీమవరం(ప్రకాశంచౌక్) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యకారుల సంక్షేమంతోపాటు మత్స్యరంగ సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆదేశించారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రిని నూతనంగా ఎన్నికై న ఉమ్మడి జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు మైల వసంతరావు, పాలకవర్గ సభ్యులు కలిశారు. జిల్లాలో మత్స్యకారుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మైరెన్ ప్రాంతంలోని ఫిష్ మార్కెట్లలో వసతుల కల్పన, పంచాయతీరాజ్ చెరువుల వేలంలో 10 శాతం పరిమితి దాటకుండా చర్యలు తీసుకోవాలని, వలలు, నావలకు ప్ర భుత్వం ఇచ్చే సబ్సిడీని 75 శాతం పెంచాలని, మత్స్యకార కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, మత్స్యకారుల వాహనాలకు ఇచ్చే రాయితీలు పెంచాలని పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సంఘ వైస్ ప్రెసిడెంట్ రాజా బాలాజీ, డైరెక్టర్లు వూడిమూడి శ్రీనివా స్, బేరం శ్రీరామచంద్రమూర్తి, బెజవాడ నాగరాజు, తిరుమాణి సీతామాలక్ష్మి, మోకా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
‘హోమియో’పై అవగాహన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): హోమియో వైద్య విధానంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించేందుకు నిర్ణయించామని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజీషియన్స్ (ఐఐహెచ్‌పీ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కేఎస్‌ఎస్ శివమూర్తి తెలిపారు. గత నెల 22,23 తేదీల్లో పూణేలో జరిగిన జాతీయ హోమియో వైద్యుల సదస్సులో ఏలూరుకు చెందిన డాక్టర్ శివమూర్తిని ఐఐహెచ్‌పీ జాతీ య అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం నగరంలో ఏర్పా టుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన పదవీ కాలం 2027 వరకు ఉంటుందని, హోమియో పట్టభద్రుల విజ్ఞాన సముపార్జన కోసం వైద్య సదస్సులు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ హోమియో వైద్యుల నియామకాలు, హోమియో వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బందిని పెంచడం కోసం కృషి చేస్తామన్నారు. హోమియో వైద్యంలో ఎండీ కోర్సు లు, నూతన సబ్జెక్టుల ప్రారంభం, సూపర్ స్పెషాలిటీ కోర్సుల కోసం కృషి చేస్తామన్నారు. హోమియో మందుల ప్రామాణికతను పెంచడానికి, సమాజంలో వివిధ వైరస్‌ల నివారణకు ఉచిత వ్యాధి నిరోధక శిబిరాలు ఏర్పా టు చేయాలని నిర్ణయించామన్నారు. అనంతరం హోమియో వైద్య నిపుణులు ఆయన్ను సత్కరించారు. ఐఐహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు వీకే పంకజాక్షన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి.గోపీనాథ్, జిల్లా అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్రెజరీ సంఘ ఎన్నికలు ఏకగ్రీవం

ట్రెజరీ సంఘ ఎన్నికలు ఏకగ్రీవం
Comments
Please login to add a commentAdd a comment