పట్టభద్రుల కౌంటింగ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల కౌంటింగ్‌ ప్రారంభం

Published Tue, Mar 4 2025 12:38 AM | Last Updated on Tue, Mar 4 2025 12:38 AM

పట్టభ

పట్టభద్రుల కౌంటింగ్‌ ప్రారంభం

సాక్షి ప్రతినిధి, ఏలూరు/ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఏలూరులోని సర్‌ సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి కె. వెట్రిసెల్వి నేతృత్వంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. స్ట్రాంగ్‌రూమ్‌ కూడా ఇంజనీరింగ్‌ కళాశాలలోనే ఏర్పాటు చేయడంతో కౌంటింగ్‌ హాలుకు బ్యాలెట్‌ బాక్సులు తరలించారు. ఉభయగోదావరి జిల్లాల్లో 2,18,997 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా గతనెల 27న జరిగిన పోలింగ్‌లో 69.50 శాతం పోలింగ్‌ నమోదైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమి బలపరిచిన టీడీపీ నేత పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్‌ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులతో పాటు మాజీ ఎంపీ హర్షకుమార్‌ తనయుడు జీవీ సుందర్‌కుమార్‌తో పాటు 32 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు.

ఉదయం 6.30 గంటల నుంచి..

ఉదయం 6.30 గంటలకు పోలింగ్‌ కేంద్రంలో సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. కలెక్టర్‌ పర్యవేక్షణలో స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి బ్యాలెట్‌ బాక్సులను కౌంటింగ్‌ హాలుకు తరలించారు. ఇంజనీరింగ్‌ కళాశాలలోని కౌంటింగ్‌ హాలులో 28 టేబుళ్లను ఏర్పాటు చేసి 17 రౌండ్లలో ఓట్లు లెక్కించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు బ్యాలెట్లు కట్టలు కట్టేందుకు సమయం ప ట్టింది. ఉభయగోదావరిలోని ఆరు జిల్లాల్లో 456 పోలింగ్‌ కేంద్రాల్లో 1,368 బ్యాలెట్‌ బాక్సులు విని యోగించారు. వీటన్నింటినీ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తెరిచి ఓట్లను కట్టలు కట్టి అనంతరం చెల్లిన, చెల్లని ఓట్లను గుర్తించి అలాగే మొదటి ప్రా ధాన్యత ఓట్లను కూడా గుర్తించేలా లెక్కించనున్నా రు. మొదటి 8 రౌండల్లో మొదటి ప్రాధాన్యతా ఓట్లను లెక్కిస్తారు.

700 మంది సిబ్బంది.. 24 గంటలూ విధులు

ఆరు జిల్లాల నుంచి వచ్చిన అధికారులు, ఉద్యోగులు మూడు షిఫ్టుల్లో కౌంటింగ్‌ విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి షిఫ్టునకు సుమారు 240 మంది సిబ్బంది 8 గంటలపాటు పనిచేసేలా విధులు కేటాయించి ముందస్తుగానే కౌంటింగ్‌కు సంబంధించి శిక్షణా తరగతులు కూడా నిర్వహించారు. ఆరుగురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 22 మంది ఎస్సైలు, 38 మంది ఏఎస్సైలు, 92 మంది కానిస్టేబుళ్లు, 166 మంది హోంగార్డులు బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు.

లెక్కింపు ఇలా..

సాధారణ కౌంటింగ్‌ ప్రక్రియ కంటే కొంత భిన్నంగా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోలైన ఓట్లల్లో చెల్లే ఓట్లను పరిగణనలోనికి తీసుకుంటారు. 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఉదాహరణకు 2,20,000 ఓట్లల్లో సుమారు 1,10,001 ఓట్లు 17 రౌండ్లకుగాను మొదటి 8 రౌండ్లల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థి విజేతగా నిలుస్తారు.

రాత్రి 10 గంటలకు తొలి రౌండ్‌

ఓట్లు కట్టలు కట్టడం, చెల్లిన, చెల్లని ఓట్లు గుర్తింపు, మొదటి ప్రాధాన్యత ఓట్లు గుర్తింపు ప్రక్రియంతా పూర్తి చేసుకుని సుమారు రాత్రి 10 గంటల సమయంలో మొదటి రౌండ్‌ లెక్కింపు 28 టేబుళ్లల్లో ప్రారంభమైంది. మొదటి రౌండ్‌లో 10,783 ఓట్లను లెక్కిస్తున్నారు.

ప్రహసనంలా ప్రక్రియ

రాత్రి 10 గంటలకు మొదటి రౌండ్‌ లెక్కింపు

12 గంటలకు పైగా సాగిన బ్యాలెట్‌ కట్టల విభజన

28 టేబుళ్లలో 17 రౌండ్లలో లెక్కింపు

తొలి 8 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్‌

ఆరు జిల్లాల పరిధిలో పోలైన ఓట్లు 2,18,997

నిరంతరాయంగా సాగుతున్న ప్రక్రియ

జిల్లాల వారీగా పోలైన ఓట్లు

జిల్లా ఓట్లు పోలింగ్‌

శాతం

ఏలూరు జిల్లా 29,651 70.13

పశ్చిమగోదావరి 48,893 69.80

అల్లూరి సీతారామరాజు 3,637 77.90

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌

కోనసీమ 47,125 73.90

తూర్పుగోదావరి 42,446 67.41

కాకినాడ 47,150 68.84

No comments yet. Be the first to comment!
Add a comment
పట్టభద్రుల కౌంటింగ్‌ ప్రారంభం 1
1/2

పట్టభద్రుల కౌంటింగ్‌ ప్రారంభం

పట్టభద్రుల కౌంటింగ్‌ ప్రారంభం 2
2/2

పట్టభద్రుల కౌంటింగ్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement