శ్రీవారి సేవలో కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి మంగళవారం రాత్రి సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ముందుగా దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆమెకు వేద ఆశీర్వచనాన్ని పలుకగా, సూపరింటెండెంట్ రమణరాజు శ్రీవారి జ్ఞాపికను, ప్రసాదాలను అందజేశారు.
కోళ్ల వ్యర్థాల వాహనాలు సీజ్
పెదపాడు: అక్రమ రవాణా చేస్తున్న కోళ్ల వ్యర్థాల వాహనాలను పెదపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు వివరాలు ప్రకారం పెదపాడు మండలంలోని వడ్డిగూడెం, తోటగూడేనికి కోళ్ల వ్యర్థాల వాహనాలు తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు వాహనాలను అడ్డుకుని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సదరు వాహన డ్రైవర్ వాహన యజమాని చేపల చెరువు యజమానులపై కేసు నమోదు చేసి, కోళ్ల వ్యర్థాలను ధ్వంసం చేస్తామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment