త్రీడి బయో ప్రింటింగ్ అద్భుతం
తాడేపల్లిగూడెం: శరీరంలో ఏ అవయవం దెబ్బతింటే ఆ అవయవాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా తయారుచేయడానికి త్రీడి బయో ప్రింటింగ్ ఉపయోగపడుతుందని, ఇది ఓ అద్భుతం మంగళవారం నిట్‌లో జరిగిన కార్యక్రమంలో ఐఐటీ బయో ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ అశోక్‌కుమార్ అన్నారు. వైద్య రంగంలో త్రీడి బయో ప్రింటింగ్ ఓ సంచలనంగా మారనుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీ భవిష్యత్‌లో నూతన అధ్యాయానికి నాంది పలకనుందన్నారు. అత్యవసర పరిస్ధితుల్లో అవయవాలు దొరక్క ఇబ్బంది పడుతున్న కుటుంబాల్లో త్రీడి బయో ప్రింటింగ్ వెలుగులు నింపనుందన్నారు. కార్యక్రమంలో డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ రవికిరణ్‌శాస్త్రి, సుదర్శన్ దీప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment