
పరుగుల జ్యోతి
తణుకు అర్బన్: తణుకుకు చెందిన దండి జ్యోతికశ్రీ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించి కీర్తి చాటింది. ఒలింపిక్స్ పోటీల్లో పరుగు విభాగంలో ఆమె పరుగెత్తిన రోజు దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో ప్రముఖంగా నిలిచింది. తణుకుకు చెందిన అతి సామాన్యుడైన శ్రీనివాసరావు కుమార్తె జ్యోతిక శ్రీ చిన్ననాటి నుంచి తండ్రి సహకారంతో స్థానిక చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో వేసిన అడుగులు ఆమె ను ప్యారిస్ ఒలింపిక్స్‌కు చేర్చాయి. పరుగులో ఆటంకాలు, కష్టనష్టాలు, ఒడిదుడుకులు ఎదురైనా అలుపెరుగని దీక్షతో ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది జ్యోతికశ్రీ. శ్రమ, పట్టుదలతో ఏస్థాయికి అయినా చేరవచ్చనడానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ తణుకు
అమ్మాయి.
Comments
Please login to add a commentAdd a comment