
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు
భీమవరం: భీమవరం టూటౌన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపించారు. టూటౌన్ సీఐ జి.కాళీచరణ్ నేతృత్వంలో ఈ నెల 9న రాత్రి టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సెంటర్, పద్మాలయ థియేటర్ ప్రాంతాల్లో మద్యం తాగి బైక్ నడుపుతున్న అయిదుగురిని అరెస్టు చేసి భీమవరం స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు. టూటౌన్ పరిధిలోని ఏడుగురిని న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా వారికి జరిమానా విధించినట్లు సీఐ కాళీచరణ్ చెప్పారు.
ఉండి పోలీసు స్టేషన్ పరిధిలో..
ఉండి: ఉండి పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరికి రూ.20 వేల జరిమానా విధించారు. ఇటీవల ఎస్సై ఎండీ నసీరుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో పట్టుబడిన ఇద్దరు వాహనదారులపై కేసులు నమోదు చేసి భీమవరం స్పెషల్ కోర్టుకు హాజరుపర్చారు. రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment