
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన నిధులు తక్షణమే విడుదల చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు డిమాండ్ చేశారు. స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో సోమవారం జరిగిన సమావేశంలో మంగరాజు మట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. మోగా డీఎస్సీ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12న నిరుద్యోగుల కోసం, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వైఎస్‌ఆర్‌సీపీ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాకు మాల మహానాడు పూర్తి మద్దతు ప్రకటిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment