మీరేం చేశారో చెప్పండి! | - | Sakshi
Sakshi News home page

మీరేం చేశారో చెప్పండి!

Published Wed, Jan 29 2025 1:57 AM | Last Updated on Wed, Jan 29 2025 1:57 AM

మీరేం

మీరేం చేశారో చెప్పండి!

గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్‌
గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను మోతె మండలం మామిళ్లగూడెం శివారులో పోలీసులు పట్టుకున్నారు.
కాంగ్రెస్‌ మోసం.. రైతులకు శాపం
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
కార్యదర్శులపై పనిభారం
ఆర్‌పీలకు వేతనాలు వచ్చేశాయ్‌!

ఏసీబీ వలలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌లోని ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు.

- 8లో

బుధవారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2025

- 9లో

గులాబీ శ్రేణుల్లో జోష్‌

నింపిన కేటీఆర్‌

నల్లగొండ గడియారం సెంటర్‌లో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన రైతు మహా ధర్నా సక్సెస్‌ అయింది. పోలీసులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతి ఇచ్చారు. ఆ సమయంలోనే ధర్నా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గడియారం సెంటర్‌ అంతా గులాబీ మయమైంది. హైదరాబాద్‌రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు కేటీఆర్‌కు స్వాగతం పలికారు. భారీ ర్యాలీగా గడియారం సెంటర్‌కు చేరుకున్నారు. అనుమతి ఇచ్చిన సమయానికంటే ముందుగానే కేటీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు. ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిలో ఉత్సాహం నింపేలా కేటీఆర్‌ ప్రసంగించారు.

హనుమంతుడికి

ఆకుపూజ

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు.

బాధితులకు

న్యాయం చేయాలి

యాదగిరిగుట్ట: రూ.10కోట్లతో ఊడాయించిన జై భవాని జ్యూవెలరీ యజమాని దత్తును పోలీసులు పట్టుకొని, బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్‌ పోలీసులను డిమాండ్‌ చేశారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని జై భవాని జ్యూవెలరీ దుకాణం ఎదుట రిలే నిరాహార దీక్ష చేస్తున్న బాధితులకు వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిత్తును పట్టుకునేంత వరకు పట్టణంలోని జ్యూవెలరీ దుకాణాలు, మార్వాడీ దుకాణాలు తీయొద్దని పోలీసులకు ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ఆదేశాలు ఇచ్చారని, కానీ స్థానిక నేతల అండతో దుకాణాలు తీసేందుకు యత్నిస్తున్నారన్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు బెలిదే అశోక్‌, పేరబోయిన మహేందర్‌, పేరబోయిన బంగారు, బుచ్చిబాబు, బందారపు మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

బడ్జెట్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్నిక

భువనగిరి: బడ్జెట్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా భువనగిరి పట్టణంలోని విజ్ఞాన్‌ ఐఐటీ స్కూల్‌ కరస్పాండెంట్‌ డాక్టర్‌ పగిడాల జలందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం భువనగిరి పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడ్జెట్‌ పాఠశాలల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మిరియాల దుర్గాప్రసాద్‌, ప్రభాకర్‌రెడ్డి, యాదయ్య, శ్రీరామ్‌, చంద్రశేఖర్‌, బాల్‌రెడ్డి, మైపాల్‌రెడ్డి, పడాల వెంకటేశం, మజీద్‌ బాబా, జానీ తదితరులు పాల్గొన్నారు.

మహా ధర్నాను అడ్డుకోవడం కాదు..

దమ్ము ౖధైర్యం ఉంటే కోమటిరెడ్డి.. గడియారం సెంటర్‌లో మీటింగ్‌ పెట్టు

రైతుల ర్యాలీ చూస్తుంటే కేసీఆర్‌ విజయోత్సవ ర్యాలీలా ఉంది

ప్రజా శక్తి ముందు ఏ శక్తీ గొప్పది కాదు

రైతు మహా ధర్నాలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

మహా ధర్నా సక్సెస్‌.. బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌..

ర్యాలీలో అభివాదం చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రైతు మహా ధర్నాను అడ్డుకోవడం కాదు.. దమ్ము, ధైర్యం ఉంటే గడియారం సెంటర్‌లో మీటింగ్‌ పెట్టి రైతులకు మీ ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పండి..్ఙ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాలు విసిరారు. మంగళవారం నల్లగొండ గడియారం సెంటర్‌లో నిర్వహించిన రైతు మహా ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అహంకారం, ఆకారాలు పెరిగాయి తప్ప వారు రైతులకు చేసిందేమీలేదని దుయ్యబట్టారు. తాము యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం, యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ను నిర్మించామని, రైతుల కోసం 11 సార్లు రైతు బంధు, రైతుబీమా ఇచ్చామని, రుణ మాఫీ చేశామన్నారు. వారు రైతులకు ఏం చేశారో గడియారం సెంటర్‌లో మీటింగ్‌ పెట్టి చెప్పాలన్నారు.

విజయోత్సవ ర్యాలీలా అనిపించింది

‘నల్లగొండకు వస్తుంటే ఐటీ హబ్‌ కళ తప్పి కనిపించింది. అందులో కోమటిరెడ్డి మనుషులు ఉంటున్నారో.. లేకపోతే తాగుబోతులకు నిలయమైందోగానీ ఐటీ హబ్‌ కళ తప్పి కనిపించింది..’ అన్నారు. ‘ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు వచ్చాక మహా ధర్నాకు వచ్చిన నాకు భారీ స్వాగతం పలికారు. భారీ ఎత్తున ర్యాలీ తీశారు. ఆ జనాలను చూస్తుంటే కేసీఆర్‌ మళ్లీ సీఎం అయ్యారు.. భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా కనిపించింది..’ అని అన్నారు.

దున్నపోతును తెచ్చుకున్నామంటున్నరు

‘హైదరాబాద్‌ నుంచి వస్తుంటే పెద్దకాపర్తి వద్ద చిరుమర్తి లింగయ్య ఆపారు. అక్కడ ఓ రైతు తనను కలిసి ‘పాలిచ్చే ఆవును అమ్మి ఎగిరెగిరి తన్నే దున్నపోతును కొనుక్కున్నట్లుంది..‘ అని అన్నారు. అప్పుడు రైతుబంధు వచ్చేది. రైతుబీమా వచ్చేది.. ఇప్పుడు రావడం లేదంటూ రైతు చెప్పిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు.

ప్రజా శక్తి ముందు ఏ శక్తీ గొప్పది కాదు

ప్రపంచంలో ఏ శక్తి ప్రజా శక్తి కంటే గొప్పది కాదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆ నిజాన్ని పోరాటాల గడ్డ నల్లగొండ రుజువు చేసిందన్నారు. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతవ్‌ కొడుకో నైజాం సర్కారోడ అని నైజామ్‌ను నిలదీసిన గడ్డ నల్లగొండ అని అన్నారు. పక్కన కృష్ణమ్మ ఉన్నా ప్రయోజనం లేదు. పాలమూరు నల్లగొండ జిల్లాలు నీరు లేక ఆనాడు ఇబ్బందులు పడ్డాయన్నారు. కేసీఆర్‌ ఆనాడు పాలమూరు వలసల మీద పాట పాడారని, అదే కాదు చూడు..చూడు నల్లగొండ. గుండె నిండా ఫ్లోరైడ్‌ బండ అంటూ పాట రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీల్లో అన్నీ అమలు చేయలేక అబద్ధాలు ఆడుతున్నారన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌కు కాంగ్రెసే కారణమన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా నీటిని నల్లగొండకు అందించి ఫ్లోరైడ్‌ను తరిమి కొట్టామని, సాగునీటిని అందించి ధాన్యం పండించడంలో తెలంగాణలో నల్లగొండను నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిపామన్నారు. తాము రెండు పంటలకు నీరందిస్తే, కాంగ్రెస్‌ పాలనలో ఒక్క పంటకూ నీరిచ్చే దిక్కులేకుండా పోయిందన్నారు.

కాంగ్రెస్‌ కార్యకర్తల్లా

వ్యవహరిస్తున్న కొందరు పోలీసులు

కొందరు పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. నల్లగొండలో ప్లెక్సీల తొలగింపు విషయంలో ధర్నా చేస్తే మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని అరెస్టు చేయడం వంటివి చేశారన్నారు. కొందరు పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తల్లా వ్యవహరించారని, అంతా గుర్తు పెట్టుకుంటామన్నారు. తాము అధికారంలోకి వస్తామని, వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.

నల్లగొండ టూటౌన్‌: రైతులకు హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని, రైతాంగం తిరుగుబాటు చేస్తుంటే అక్రమ కేసులు పెట్టి అణచివేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. రైతు మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కోరితేనే కేసీఆర్‌ సీఎం అయ్యాడన్నారు. పిల్లలకు చాక్లెటు ఇచ్చి దొంగలు ఎత్తుకెళ్లినట్లు రైతులకు హామీ ఇచ్చి కాంగ్రెస్‌ మోసం చేసిందన్నారు. రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డి మోసాన్ని చెప్పేందుకే కేటీఆర్‌ నల్లగొండ వచ్చాడని అన్నారు. నల్లగొండలో ఆకు రౌడీలు ఏమీ చేయలేరని అన్నారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ.. రైతు బంధు కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి రైతును మోసం చేశాడని, ఎకరానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. 17,500 బాకీ పడిందన్నారు. ధాన్యం బోనస్‌ రూ.500 ఎగ్గొట్టిందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ రైతు ధర్నాకు వస్తానంటే కాంగ్రెస్‌ నాయకులకు దడ పుడుతుందన్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజలను మోసం చేశారని అన్నారు. ఇంకా ఈ ధర్నాలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునిత, గాదరి కిషోర్‌కుమార్‌, నల్లమోతు భాస్కర్‌రావు, బొల్లం మల్లయ్యయాదవ్‌, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, నోముల భగత్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, నిరంజన్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, నాయకులు బండా నరేందర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్‌, కంచర్ల రామకృష్ణారెడ్డి, చిరుమర్తి లింగయ్య, బూడిద బిక్షమయ్యగౌడ్‌, తిప్పన విజయసింహారెడ్డి, కర్నె ప్రభాకర్‌, గొంగిడి మహేందర్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, దూదిమెట్ల బాలరాజు, రాకేష్‌రెడ్డి, రామచంద్రనాయక్‌, మందడి సైదిరెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, బోనగిరి దేవేందర్‌ పాల్గొన్నారు.

నల్లగొండ టూటౌన్‌ : యూనివర్సిటీల సమస్యలు, విద్యార్థుల ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. రైతు మహాధర్నా కోసం నల్లగొండకు వచ్చిన కేటీఆర్‌ యూనివర్సిటీ విద్యార్థుల కోరిక మేరకు అన్నెపర్తి సమీపంలో ఉన్న మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద ఆగి విద్యార్థుల సమస్యలు, యూనివర్సిటీలో వసతుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు యూనివర్సిటీ సమస్యలను కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రేవంత్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. గొడ్డు కారం వేసి పెడుతున్నారని స్వయంగా విద్యార్థులే చెబుతుండడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. యూనివర్సిటీ లోపలికి రావాలని విద్యార్థులు కేటీఆర్‌ను కోరగా అనుమతి లేకుండా లోపలికి వస్తే మీపై కేసులు పెట్టి వేధిస్తారని, సమస్యల పరిష్కారం కోసం మీ తరఫున పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, బాల్క సుమన్‌, విద్యార్థి నాయకుడు బొమ్మరబోయిన నాగార్జున ఉన్నారు.

రామన్నపేట: ఏడాదిగా పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో అన్నీ తామై వ్యవహరిస్తున్న కార్యదర్శులకు పని భారం పెరుగుతోంది. రోజు వారీ విధులతోపాటు సర్వేలు, పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయడం తలకు మించిన భారంగా మారుతోంది. దీనికితోడు నిధుల లేమితో సమస్యలు పరిష్కారం కాక ప్రజలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.

భారంగా మారిన పంచాయతీల నిర్వహణ

జిల్లాలో 428 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసింది. ప్రభుత్వం సర్పంచ్‌ల స్థానంలో మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. నిధులు లేకపోవడంతో వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్యం మెరుగు, మంచినీటి సరఫరా వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు పంచాయతీ కార్యదర్శులపై ఆర్థికభారం పడుతోంది.

ఓ వైపు సర్వేలు.. మరోవైపు ఆన్‌లైన్‌ నమోదు

పంచాయతీ కార్యదర్శులకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్‌ నమోదు వంటి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఆన్‌లైన్‌ చేసే క్రమంలో మండలానికి 200 నుంచి 300 వరకు దరఖాస్తులు నమోదు కాలేదు. ఆ కుటుంబాల వారు గృహలక్ష్మీ (సబ్సిడీ గ్యాస్‌), గృహజ్యోతి పథకాలను పొందలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తులు స్వీకరించిన పంచాయతీ కార్యదర్శులు వారికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇటీవల చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే, నమోదు ప్రక్రియ మానిటరింగ్‌ బాధ్యతను పంచాయతీ కార్యదర్శులే నిర్వర్తించారు.

భువనగిరి: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పనిచేస్తూ మున్సిపాలిటీ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల పొదుపు లెక్కలు, బ్యాంకు రుణాలు ఇప్పించే బాధ్యత చూసే ఆర్‌పీ(రిసోర్స్‌పర్సన్‌)లకు వేతనాల బకాయిలు విడుదలయ్యాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి వేతనాలు నిలిచిపోగా.. సంఘాల బాధ్యతతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకునే ఆర్‌పీలకు చాలీచాలని వేతనం ఇస్తున్నారు. అది కూడా సకాలంలో అందడం లేదు. ఈ ఏడాదికి సంబంధించి ఆరు నెలల వేతనాలు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆరు నెలల వేతనాలు విడుదల చేసింది. జిల్లాలో ఆరు మున్సిపాలిటీల పరిధిలో పనిచేస్తున్న 96 మంది ఆర్‌పీలకు రూ.34.56 లక్షల విడుదల అయ్యాయి. ఈ నిధులు మహిళా స్వయం సహాయక సంఘాల సమాఖ్య ఖాతాల్లో జమ అయ్యాయని మెప్మా పరిపాలన జిల్లా అధికారి రమేష్‌ బాబు తెలిపారు.

నెలకు రూ. 600 నుంచి పని..

గతంలో ప్రభుత్వం మెప్పా ఆర్‌పీలకు నెలకు రూ. 600 పారితోషికం అందించేది. ఆ తర్వాత ఆ పారితోషికాన్ని వెయ్యికి తరువాత రూ.రెండు వేలకు పెంచుతూ వచ్చింది. 2018 నుంచి ఆర్‌పీలకు నెలకు రూ. 4వేలు వేతనం, పట్టణ సమాఖ్య నుంచి మరో రూ.2వేలు కలిపి రూ. 6వేల చొప్పున సీ్త్ర నిధి ద్వారా చెల్లిస్తున్నారు. అయితే వేతనం ప్రభుత్వం ఇవ్వకుండా సీ్త్ర నిధి ద్వారా పారితోషికం ఇవ్వడాన్ని ఆర్‌పీలు వ్యతిరేకిస్తున్నారు. కనీస వేతన విధానం అమలు చేయాలని గత ప్రభుత్వం హయాంలో మంత్రులు, అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం వచ్చాక కూడా హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ధర్నాలు సైతం చేశారు.

సమాధానం చెప్పలేకపోతున్నాం

ఈ మధ్యకాలంలో సర్వే పేరుతో ఒక్కో కుటుబం వద్దకు మూడు నాలుగు సార్లు వెళ్లాం. జాబితాలో పేరు వచ్చిన వారు, రానివారు ప్రతి ఒక్కరు ప్రతి పథకానికి సంబంధించి పంచాయతీ కార్యదర్శినే బాధ్యుడిని చేసి మాట్లాడుతున్నారు. ప్రజల సందేహాలకు సమాధానం చెప్పలేకపోతున్నాము. పథకాల లబ్ధిదారుల ఎంపిక, అమలు బాధ్యత శాఖల వారీగా అప్పగిస్తే బాగుంటుంది.

– పవన్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి, శోభనాద్రిపురం

పనిభారంతో సతమతమవుతున్నాం

ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు విజయవంతం చేయడానికి రాత్రింబవళ్లు పని చేయాల్సి వచ్చింది. సెలవురోజులు, పండుగ సమయాల్లోనూ పనిచేశాం. సంబంధం లేని శాఖకు సంబంధించిన పనులు అప్పగించడం వల్ల పనిభారంతో సతమతమవుతున్నాం.

– చంద్రశేఖర్‌, పంచాయతీ కార్యదర్శుల సంఘం

మండల అధ్యక్షుడు, రామన్నపేట

న్యూస్‌రీల్‌

అన్నింటికీ కార్యదర్శే జవాబుదారీ..

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్‌కార్డుల జారీకి సంబంధించి లబ్ధిదారులను గుర్తించేందుకు ఈనెల 16 నుంచి 20 వరకు గ్రామాల్లో సర్వే నిర్వహించారు. రైతు భరోసాకు సంబంధించి రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఉపాధిహామీ ఉద్యోగులు పరిశీలన చేశారు. గృహ నిర్మాణశాఖ వారు చేయాల్సిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే, రెవెన్యూ శాఖ చేయాల్సిన రేషన్‌ కార్డుల పరిశీలన బాధ్యతను పంచాయతీ కార్యదర్శులు మోయాల్సి వచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. 21 నుంచి మొదలైన గ్రామసభల్లో వివిధ పథకాలకు సంబంధించి జాబితాలో పేరులేని వారు స్థానికంగా ఉండే పంచాయతీ కార్యదర్శులను నిలదీస్తున్నారు. వారికి ప్రజలకు సమాధానం చెప్పలేక కార్యదర్శులు సతమతమవుతున్నారు.

ఫ పాలకవర్గాలు ముగియడంతో అన్నీతామై వ్యవహరిస్తున్న కార్యదర్శులు

ఫ రెవెన్యూ, గృహ నిర్మాణం,

ఉపాధి శాఖల పనులతో ఒత్తిడి

ఫ నిధుల లేమితో సమస్యలు

పరిష్కారం కాక.. ప్రజలకు

సమాధానం చెప్పలేక సతమతం

విడుదలైన వేతన బకాయిలు ఇలా..

మున్సిపాలిటీ ఆర్‌పీల సంఖ్య వేతనం

భువనగిరి 41 రూ. 14.76 లక్షలు

ఆలేరు 11 రూ. 3.96 లక్షలు

చౌటుప్పల్‌ 14 రూ. 5.04 లక్షలు

యాదగిరిగిగుట్ట 08 రూ. 4.32 లక్షలు

మోత్కూర్‌ 10 రూ. 3.60 లక్షలు

పోచంపల్లి 12 రూ. 4.32 లక్షలు

మొత్తం 96 రూ.34.56 లక్షలు

ఫ ఆరు నెలల బకాయిలు విడుదల

ఫ 96 మంది ఆర్‌పీలకు

రూ.34.56 లక్షలు మంజూరు

No comments yet. Be the first to comment!
Add a comment
మీరేం చేశారో చెప్పండి!1
1/13

మీరేం చేశారో చెప్పండి!

మీరేం చేశారో చెప్పండి!2
2/13

మీరేం చేశారో చెప్పండి!

మీరేం చేశారో చెప్పండి!3
3/13

మీరేం చేశారో చెప్పండి!

మీరేం చేశారో చెప్పండి!4
4/13

మీరేం చేశారో చెప్పండి!

మీరేం చేశారో చెప్పండి!5
5/13

మీరేం చేశారో చెప్పండి!

మీరేం చేశారో చెప్పండి!6
6/13

మీరేం చేశారో చెప్పండి!

మీరేం చేశారో చెప్పండి!7
7/13

మీరేం చేశారో చెప్పండి!

మీరేం చేశారో చెప్పండి!8
8/13

మీరేం చేశారో చెప్పండి!

మీరేం చేశారో చెప్పండి!9
9/13

మీరేం చేశారో చెప్పండి!

మీరేం చేశారో చెప్పండి!10
10/13

మీరేం చేశారో చెప్పండి!

మీరేం చేశారో చెప్పండి!11
11/13

మీరేం చేశారో చెప్పండి!

మీరేం చేశారో చెప్పండి!12
12/13

మీరేం చేశారో చెప్పండి!

మీరేం చేశారో చెప్పండి!13
13/13

మీరేం చేశారో చెప్పండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement