![ప్రత్యేకాధికారిగా బాధ్యతల స్వీకరణ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/28/27bng30-230002_mr-1738009188-0.jpg.webp?itok=X3nQukz8)
ప్రత్యేకాధికారిగా బాధ్యతల స్వీకరణ
భువనగిరి టౌన్ : మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారిగా నియమితులైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 26న పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఆయనను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు చేపట్టారు. భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, మోత్కూరు, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ మున్సిపాలిటీల కమిషనర్లు ప్రత్యేక అధికారిని కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మున్సిపాలిటీల్లోని పెండింగ్ పనులు, ఇతర సమస్యలపై కమిషనర్లతో చర్చించారు. త్వరలో మున్సిపాలిటీల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment