‘పొదుపు నిధి’ తో ఆర్థిక భరోసా..
సాక్షి, యాదాద్రి : చేనేత అభహస్తం పథకంలో భాగంగా పొదుపు నిధి పథకానికి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందాలంటే జియోట్యాగింగ్ తప్పనిసరి. ఈనెల 15తో దరఖాస్తు గడువు ముగియనుంది. దరఖాస్తుదారుల వివరాలను 16నుంచి రిజిస్ట్రేషన్ చేయనున్నారు. మార్చి 1నుంచి ఆర్డీ –1, ఆర్డీ–2 ఖాతాలను ప్రారంభించనున్నారు.
అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానం
● ప్రీలూమ్, ప్రిపరేటరీ, డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్ వంటి పనుల్లో ఉన్న కార్మికులు అర్హులు. జియోట్యాగ్ తప్పనిసరి
● 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
● దరఖాస్తుఫారంపై కార్మికుడి ఫొటో అంటించాలి. ఆధార్ ప్రకారం వయస్సు నిర్ధారణ చేస్తారు.
● ఫ్రిబవరి 1వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించారు.
మొదలైన దరఖాస్తుల స్వీకరణ
ఈనెల 15 చివరి గడువు
జియోట్యాగ్ కార్మికులు,
అనుబంధ కార్మికులకు వర్తింపు
పథకం అమలు విధానం ఇలా..
పొదుపునిధి పథకం పూర్తికాలం 24 నెలలు. చేనేత కార్మికుడు, అనుబంధ కార్మికుడు తన నెలవారి వేతనంలో ప్రతినెలా 15వ తేదీ వరకు ఆర్డీ ఖాతాలో జమ చేయాలి. ప్రభుత్వం తన వాటాధనంగా 16శాతం జమ చేస్తుంది. సభ్యుడు తన వాటాధనం మూడు నెలలు చెల్లించకపోతే డిపాల్టర్‌గా పరిగణిస్తారు. లబ్ధిదారు మరణించిన పక్షంలో నామినీ లేదా చట్టపరంగా వర్తించే వారికి చెల్లిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment