నల్లగొండ: వరంగల్–నల్లగొండ–ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాలుగవ రోజైన గురువారం ఇద్దరు నామినేషన్లు సమర్పించారు. స్వతంత్ర అభ్యర్థులైన అర్వ స్వాతి, చాలిక చంద్రశేఖర్ నామినేషన్లు దాఖలు చేశారు. వీరు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠికి సమర్పించారు. అలాగే లింగిడి వెంకటేశ్వర్లు మరో సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
నేడు ప్రధాన సంఘాల
అభ్యర్థుల నామినేషన్..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లకు 7, 10వ తేదీల్లోనే అవకాశం ఉండడంతో ఆ రెండు రోజు ల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రధాన సంఘాలకు చెందిన అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. దీంట్లోభాగంగా శుక్రవారం ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి టీఎస్ యూటీఎఫ్ తరపున నామినేషన్ వేయనున్నారు. అలాగే టీపీయూఎస్ అభ్యర్థి సరోత్తంరెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్తి హర్షవర్ధన్‌రెడ్డిలు కూడా నామినేషన్లు సమర్పించనున్నారు. కాగా పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి 10వ తేదీన నామినేషన్ సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.
కొనసాగుతున్న ఉపాధ్యాయ
ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ
నేడు యూటీఎఫ్, టీపీయూఎస్
అభ్యర్థుల నామినేషన్లు
Comments
Please login to add a commentAdd a comment