ఫిబ్రవరిలోనే మండుతున్న ఎండలు
37 డిగ్రీలు దాటిన
పగటి ఉష్ణోగ్రతలు
● సాధారణం కంటే 3నుంచి
4 డిగ్రీలు అధికం
● మున్ముందు మరింత పెరిగే అవకాశం
● జిల్లాను ఎల్లో జోన్‌గా
ప్రకటించిన వాతావరణ శాఖ
జాగ్రతలు తప్పనిసరి
పెరుగుతున్న ఎండ తీవ్రతకు తగ్గట్లుగా మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పగలు ఎండ, రాత్రి చలి వాతావరణ ఉన్నందున బయటి ఆహారం జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని అంటున్నారు. శరీరంలో నీటిశాతం పెంచే తాజా పండ్లను అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని.. పానీ పూరి, వేపుళ్లు, హోటల్ ఫుడ్స్ తదితర బయటిఫుడ్‌కు దూరంగా ఉంచాలంటున్నారు. మజ్జిగ, కొబ్బరి నీరు, రాగి జావ తాగిస్తే మంచిదంటున్నారు. మాంసాహారానికి బదులుగా శాఖాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.
భువనగిరి టౌన్ : జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన ఆరు రోజుల్లో చూస్తే అత్యధికంగా రాజాపేటలో 37.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే బొమ్మలరామారం 37.3 డిగ్రీలు, యాదగిరిగుట్టలో 37.2 డిగ్రీలు, మోత్కూరు 37.1 డిగ్రీలు, తుర్కపల్లి, సంస్థాన్‌నారాయణపురంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు న మోదయ్యాయి. ఇవి సాధారణకంటే నాలుగు డిగ్రీలు అధికమని వాతావారణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. కానీ, ఈసారి ఫిబ్రవరి ప్రారంభం నుంచే భానుడు ఠారెత్తిస్తున్నాడు. కనిష్ట ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల కని పిస్తోంది. మొన్నటి వరకు 16 నుంచి 18 డిగ్రీల వరకు నమోదు కాగా.. గురువారం జిల్లాలోని అన్ని మండలా ల్లో 20 డిగ్రీలకు పైనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎల్లో అలర్ట్
ఫిబ్రవరి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తూర్పు, ఆగ్నేయ దిశలనుంచి వేడి గాలులు వీస్తున్నాయని, ఆ ప్రభావం వల్లే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయని భువనగిరిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రానున్న మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని, దీంతో జిల్లాలో అక్కడక్కడా ఉదయం సమయంలో పొగమంచు ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఇదిలా ఉండగా మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత పెరగగా పలు చోట్ల చలి తీవత్ర ఇంకా కొనసాగుతోంది.
2 నుంచి 6వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సీయస్‌లో)
మండలం 2న 3న 4న 5న 6న
బొమ్మలరామారం 35.8 36.1 36.8 37.3 35.8
నారాయపురం 35.4 35.6 35.8 37.0 35.8
రాజాపేట 35.5 35.8 36.3 37.5 35.2
అడ్డగూడూరు 35.2 35.5 36.4 35 35.2
గుండాల 35 36.2 36.4 36.4 34.9
వలిగొండ 34.1 34.7 35.2 36.2 34.3
మోత్కూరు 35.1 36.4 37.0 37.1 36.3
తుర్కపల్లి 34.4 35.2 36,5 37 35.8
రామన్నపేట 33.7 34.8 35.2 35.2 33.9
ఆలేరు 34.2 35.1 34.8 36.1 34.3
మోటకొండూరు 34.4 34.9 35.7 36.3 34.7
ఆత్మకూర్ 35.8 35.6 36.9 35.7 34.4
పోచంపల్లి 34.5 34.8 35.9 35.6 33.8
బీబీనగర్ 34.6 35.7 36.3 36.2 35.4
చౌటుప్పల్ 34.1 35.1 36.2 35.2 35.1
యాదగిరిగుట్ట 35.5 36.8 37 37.2 35.9
భువనగిరి 34.1 34.8 35.2 36.2 35.5
Comments
Please login to add a commentAdd a comment