రక్తహీనత పరీక్షలు నిర్వహించండి : కలెక్టర్
భువనగిరి : రక్తహీనత గల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం బృందాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతిగృహాల్లోని విద్యార్థులకు రక్తహీనత సమస్యను గుర్తించేందుకు వైద్యపరీక్షలు చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చే విధంగా చర్యలు తీసుకోవాని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎంపీడీఓ
కార్యాలయం తనిఖీ
భూదాన్‌పోచంపల్లి : పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని గురువారం జెడ్పీ సీఈఓ శోభారాణి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాయలంలోని వివిధ రికార్డులను పరిశీలించారు. అభివృద్ధి పనులు, ఖర్చు, జమ తదితర వివరాలకు సంబంధించి రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాపర్తి భాస్కర్, తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సూపరింటెండెంట్ ఏపాల సత్యనారాయణరెడ్డి, జెడ్పీ కార్యాలయ సూపరింటెండెంట్ సుధాకర్‌చారి, అపర్ణ పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, తీసులదళాలతో అర్చించారు. అనంతరం ప్రథమ ప్రాకారమండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి వెండి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి, అమ్మవారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
ఆర్టీసీ దుకాణాల అద్దెకు
టెండర్ల ఆహ్వానం
రామగిరి(నల్లగొండ): నల్లగొండ రీజియన్ పరిధిలోని బస్ డిపోల ప్రధాన రోడ్ల వెంట ఉన్న ఖాళీ షాపులను అద్దెకు ఇవ్వడంతోపాటు పలు బస్ డిపోల్లో క్యాంటీన్, లాజిస్టిక్ సర్వీసెస్, సెల్‌ఫోన్ టవర్స్ కాంట్రాక్టర్ల నియామకానికి టెండర్లను ఆహ్వానిస్తున్నామని ఉమ్మడి నల్ల గొండ జిల్లా రీజనల్ మేనేజర్ కె.జానిరెడ్డి తెలి పారు. ఆసక్తి గలవారు ఈనెల 18వ తేదీ వరకు www.tender.teangana.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ టెండర్ సమర్పించాలని కోరారు. అలాగే ఆర్టీసీ పరిధిలోని దామరచర్ల బస్టాండ్‌లోని ఖాళీ స్థలంలో పెట్రోల్ బంకు నడిపేందుకు సర్వీస్ ప్రొవైడర్ నియామకానికి టెండర్ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం www.tender.teangana.gov.in నందు సంప్రదించాలని కోరారు.
పెద్దరావులపల్లిలో మాక్‌డ్రిల్
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని పెద్దరావులపల్లి సమీపంలో గురువారం గెయిల్, హెచ్‌పీసీఎల్ సంయుక్తంగా మాక్‌డ్రిల్ నిర్వహించాయి. విద్యుత్ స్తంభం పాతడానికి జేసీబీతో తవ్వినపుడు గ్యాస్ పైప్‌లైన్లకు నష్టం జరుగుకుండా, ఆగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
రక్తహీనత పరీక్షలు నిర్వహించండి : కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment