ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులు కావాలన్న ఉద్దేశంతో ఇప్పటికే వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఇందుకోసం పాఠశాలల్లో ఏ,బీ, సీ గ్రూపులుగా చేసి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. కొత్తగా ప్రేరణ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పదో తరగతి విద్యార్థికి తొలిమెట్టు లాంటిది. ఇక్కడ ఫెయిల్ అయితే చెడు వ్యవసానాలకు అవాటు పడటం, సంఘవిద్రోహులుగా మారే అవకాశం ఉంటుంది. విద్యార్థినులకు త్వరగా పెళ్లి చేయాలనే ఆలోచన తల్లిదండ్రుల్లో వస్తుంది. అందుకే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణలైతే భవిష్యత్‌లో ఉన్నతస్థానాలకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. –హనుమంతరావు, కలెక్టర్
రాష్ట్రస్థాయిలో మెరుగైన స్థానం లక్ష్యం
పదో తరగతిలో మెరుగైన స్థానంకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. తాజాగా ప్రేరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేరుగా ఉదయం ప్రధానోపాధ్యాయులతో పాటు సంబంధిత ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ప్రైవేట్ సంస్థల సహకారంతో విద్యార్థులకు అభ్యసన దీపికతో పాటు స్టడీ చైర్, రైటింగ్ ప్యాడ్‌లు అందజేస్తున్నాం. – సత్యనారాయణ, డీఈఓ
●
Comments
Please login to add a commentAdd a comment