నేటినుంచి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట పూర్వగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి.
- 8లో
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని జూలూరు ఆర్యోగ ఉప కేంద్రంలో డ్రోన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్షయ నిర్మూలనలో భాగంగా సేకరించిన తెమడ శాంపిల్స్‌ను గురువారం డ్రోన్ ద్వారా భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా డ్రోన్ సేవలను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యశోద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో క్షయ వ్యాధి నిర్మూలనే ధ్యేయంగా నాలుగు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా తెమడ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపుతున్నట్లు తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని, డ్రోన్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి శాంపిల్స్ చేరవేసినట్లు ఆమె వెల్లడించారు. దశల వారీగా అన్ని సెంటర్ల పరిధిలో డ్రోన్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భూదాన్‌పోచంపల్లి మండల వైద్యాధికారి శ్రీవాణి, సీహెచ్‌ఓ పోతారెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ వసంత, జూలూరు ఉపకేంద్రం ఆరోగ్య కార్యకర్తలు భవానీ, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment