తలుపు తట్టి.. నిద్రలేపి..
పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు కలెక్టర్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం
ఇప్పటికే అమలవుతున్నవి..
● అక్టోబర్ 17వ తేదీనుంచి సాయంత్రం సమయంలో ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. డిసెంబర్ నాటికి సిలబస్ పూర్తిచేసి జనవరి 2నుంచి ఉదయం, సాయంత్రం సమయాల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 1వ తేదీనుంచి సాయంత్రం సమయంలో అల్పాహారం అందజేస్తున్నారు.
● కలెక్టర్ తరుచూ జూమ్ మీటింగ్‌లు నిర్వహిస్తూ ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేస్తున్నారు. సబ్జెక్టు ఎక్ప్‌ఫర్ట్‌తో ప్రత్యేకంగా గ్రూపు తయారు చేసి చర్చిస్తున్నారు.
● అభ్యసన దీపికలు అందజేశారు.
● సి గ్రేడ్ విద్యార్థులను దత్తత తీసుకొని పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. జిల్లాలో 163 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటితో టెన్త్ విద్యార్థులు 4,569 మంది ఉన్నారు.
భువనగిరి : పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ హనుమంతరావు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యా ర్థులను తెల్లవారుజామున నిద్రలేపే వేకప్ కాల్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. తలుపు తట్టి.. నిద్రలేపి(ప్రేరణ) పేరుతో రూపొందించిన ఈ కార్యక్రమం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయలు 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య విద్యార్థి ఇంటికి వెళ్లి తలుపు తడుతారు. విద్యార్థి చదువుతున్నాడా లేదా పరిశీలి స్తారు. తల్లిదండ్రులకు విద్యార్థి చదువు విషయంలో సూచనలు చేస్తారు. పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి తెలియజేస్తారు.
ఉదయం 5.30 గంటలకే..
సంస్థాన్‌నారాయణపురం మండలం కంకణాలగూడెం పంచాయతీ పరిధి దేశ్యతండాలో ఇంటి తలుపు తట్టే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. టెన్త్ విద్యార్థి దేవరకొండ భరత్‌చంద్రచారి ఇంటికి ఉదయం 5.30 గంటలకు వెళ్లి తలుపు కొట్టి.. నేను జిల్లా కలెక్టర్ హనుమంతరావు వచ్చాను.. అంటూ విద్యార్థి కుటుంబాన్ని పలకరించారు. ఎలా చదువున్నావంటూ భరత్ చంద్రాచారిని ఆరా తీశారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. పేద కుటుంబం కావడంతో విద్యార్థికి రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు. పరీక్షలు ముగిసే వరకు ప్రతినెలా రూ.5వేల చొప్పున అందజేస్తానని ప్రకటించారు. కలెక్టర్ రాకతో తండావాసులు తరలివచ్చారు. అదే విధంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆలేరు మండలంలోని బండి హేమంత్ అనే విద్యార్థి ఇంటికి వెళ్లి చదువులో ప్రగతిని పరీక్షించారు. డీఈఓ, ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమకు కేటాయించిన గ్రామాల్లోని 800 మంది విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. స్టడీ చైర్లు, ఎగ్జామ్ ప్యాడ్‌లను ఉచితంగా అందజేశారు.
సంస్థాన్‌నారాయణపురం
దేశ్యతండాలో ప్రారంభించిన కలెక్టర్
మొదటి రోజు 800 మంది విద్యార్థుల ఇళ్లకు వెళ్లిన అధికారులు
చదువులో వెనుకబడిన వారిపై
ప్రత్యేక శ్రద్ధ
మూడేళ్లుగా ఉత్తీర్ణత, రాష్ట్రస్థాయిలో స్థానం
సంవత్సరం శాతం స్థానం
2021 - 22 94.15 13
2022 - 23 80.97 23
2023 - 24 99.94 25
తలుపు తట్టి.. నిద్రలేపి..
తలుపు తట్టి.. నిద్రలేపి..
Comments
Please login to add a commentAdd a comment