ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం
భువనగిరి: ఐక్యతతోనే సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహరావు అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి సీనియర్ సిటిజన్స్‌కు రావాల్సిన కన్సెషన్లు ఇప్పటి వరకు రాలేదన్నారు. వీటిని సాధించేందుకు మార్చి 10న నిర్వహించే ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు నర్సయ్య, కోశాధికారి రాంనాథ్, జిల్లా అధ్యక్షుడు శెట్టి బాలయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎర్రగుంట వెంకటేశం, ఆర్గనైజింగ్ కార్యదర్శులు నరసింహరావు, సత్యనారాయణరెడ్డి, మనోహర్‌రావు, పూర్ణచంద్రరాజు, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్
రాష్ట్ర అధ్యక్షుడు నరసింహరావు
Comments
Please login to add a commentAdd a comment