రోడ్డుపై దుర్గంధం
చౌటుప్పల్: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో చేపట్టనున్న అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా సర్వీస్‌రోడ్లకు ఇరువైపులా చేపట్టిన డ్రెయినేజీ నిర్మాణాలు ఆగుతూ సాగుతూ నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో పనులు నిలిచిపోయి నెలలు గడుస్తోంది. స్థానిక వ్యవసాయ మార్కెట్ ప్రధాన ద్వారం ముందు రెండు నెలల క్రితం చేపట్టిన నిర్మాణం మధ్యలోనే నిలిపివేశారు. దీంతో ఎగువన నవోదయ టాకీస్ వైపు నుంచి వచ్చే మురుగునీరు పూర్తిగా మార్కెట్ ఎదుట నిలుస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానిక మున్సిపాలిటీ అధికారులు కూడా స్పందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
● చౌటుప్పల్ సర్వీస్‌రోడ్డులో
నిలిచిన డ్రైనేజీ నిర్మాణ పనులు
Comments
Please login to add a commentAdd a comment