22,943 ఎకరాలు
సాగుకు యోగ్యంకాని భూములు
మండలాల వారీగా సాగుకు యోగ్యం కాని భూముల వివరాలు (ఎకరాల్లో)
మండలం గ్రామాలు సాగుకు యోగ్యం
కాని భూములు
అడ్డగూడూరు 11 214.03
ఆలేరు 10 1502.21
ఆత్మకూరు(ఎం) 17 468.18
పోచంపల్లి 23 1914.21
భువనగిరి 29 4063.33
బీబీనగర్ 25 2663.22
బొమ్మలరామారం 23 2174.31
చౌటుప్పల్ 18 1443.35
గుండాల 17 247.36
మోటకొండూరు 11 124.35
మోత్కూరు 13 236.29
నారాయణపురం 14 852.34
రాజాపేట 19 1086.14
రామన్నపేట 21 243.39
బి.తుర్కపల్లి 22 3623.24
వలిగొండ 30 381.06
యాదగిరిగుట్ట 15 1700.09
మొత్తం 22,943.31
రామన్నపేట: సాగు చేసే భూములకే రైతు భరోసా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించారు. జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన ఈ సర్వేలో జిల్లాలో 22,943 ఎకరాలు సాగుకు యోగ్యంకాని భూములుగా తేల్చారు. ఈ లెక్కన ఏడాదికి రూ.2.75 కోట్లు ప్రభుత్వ సొమ్ము ఆదా అవుతుంది. అయితే జిల్లాలోని 17 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 17 గ్రామాల్లోని 17,644మంది రైతులకు రూ 26.95కోట్లు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మిగిలిన పథకాల మాదిరిగానే రైతు భరోసా పథకం అమలు నిలిచి పోతుందేమోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.
5లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం
జిల్లాలో 2.71లక్షల మంది రైతులు ఉన్నారు. సాగు విస్తీర్ణం సుమారు ఐదు లక్షల ఎకరాల వరకు ఉంటుంది. సరాసరి 3లక్షల ఎకరాల్లో వరి, 1.20లక్షల ఎకరాల్లో పత్తి, మిగిలిన భూముల్లో పండ్ల తోటలు, ఇతర పంటలు సాగవుతాయి. గత ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2023 యాసంగి సీజన్‌లో 2,48,536 మంది రైతులకు రూ. 293.68కోట్లు రైతుబంధు పథకం కింద రైతులకు చెల్లించారు.
సాగుకు యోగ్యం కాని భూమి స్వల్పమే..
గత ప్రభుత్వం గుట్టలు, రోడ్లు, వెంచర్లు, కమర్షియల్ భూముల వంటి సాగుకు యోగ్యం భూములకు కూడా రైతుబంధును ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు అప్పట్లో విమర్శలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సాగుకు యోగ్యంకాని భూములను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఈమేరకు గ్రామసభల్లో రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 22,943 ఎకరాలు సాగుకు యోగ్యంకాని భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవి పట్టాభూములు అయినప్పటికీ గుట్టలు, రాళ్లు, వెంచర్లు, కోళ్ల ఫారాలు, రోడ్లు, ఫామ్‌లాండ్స్ ఉన్నట్లు తేలింది.
సర్వేలో గుర్తించిన అధికారులు
ప్రభుత్వానికి ఏడాదికి
రూ.2.75 కోట్ల నిధులు ఆదా
Comments
Please login to add a commentAdd a comment