![పోచంపల్లిలో నేపాల్ దేశస్తులు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06bng213-230003_mr-1738871772-0.jpg.webp?itok=tCFbx39Y)
పోచంపల్లిలో నేపాల్ దేశస్తులు
భూదాన్‌పోచంపల్లి : నేపాల్ ప్రతినిధుల బృందం గురువారం భూదాన్‌పోచంపల్లిని సందర్శించింది. సహకార పాలనపై హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు నేపాల్ దేశానికి చెందిన 30 మంది సీఈఓలు, ఎగ్జిక్యూటివ్‌లు హాజరయ్యారు. తమ టూర్‌లో భాగంగా భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. చేనేతగృహాలు, చేనేత సహకార సంఘం, టూరిజం పార్కుకు వెళ్లి మగ్గాలను పరిశీలించారు. వస్త్ర డిజైన్లు పరిశీలించి నేత కళాకారుల నైపుణ్యాలను కొనియాడారు. అలాగే చేనేత వస్త్రాలు కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment