![అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/28/27bng23-230002_mr-1738009187-0.jpg.webp?itok=sIGgbVpT)
అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని, పెండింగ్ ఉంచొద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తులు వస్తే స్వీకరించి ప్రత్యేకంగా రికార్డ్ చేసి పెట్టాలన్నారు. సైట్ ఓపెన్ కాగానే డేటాను అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. ప్రజావాణిలో 42 అర్జీలు రాగా 19 రెవెన్యూ సమస్యలకు సబంధించినవి ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, అదనపు కలెక్టర్ గంగాధర్, కలెక్టరేట్ ఏఓ జగన్‌మోహన్‌ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వినుతుల్లో కొన్ని..
● మోత్కూరులోని బిక్కేరువాగు సమీపంలో గల 9.20 ఎకరాల ప్రభుత్వ భూమిని పేద దళితులకు పంపిణీ చేయాలని కోరుతూ మోత్కూరు పట్టణానికి చెందిన పలువురు దళితులు వినతి పత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో బోడ బాబూరావు, మందుల సురేష్, గుంటి ఆనందం, వీరస్వామి, జాను, ఎల్లస్వామి, శివ, వెంకటయ్య, ఉపేందర్, సైదులు, మధు ఉన్నారు.
● వితంతు పింఛన్ మంజూరు చేయాలంటూ యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన పద్మ కలెక్టర్‌ను వేడుకున్నారు. తన భర్త ఆరేళ్ల క్రితం మృతిచెందాడని, పలుదఫాలు దరఖాస్తు చేసినా పింఛన్ మంజూరు కాలేదన్నారు.
● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్ అధ్వర్యంలో అర్జీ అందజేశారు. భువనగిరి మండలం, భువనగిరి పట్టణ పరిధిలో ఇళ్లు ఉన్నవారి పేర్లు జాబితాలో వచ్చాయని, క్షేత్రపరిశీలన చేసి న్యాయం చేయాలని కోరారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
ఫ ప్రజావాణిలో వినతులు స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment