![నిధులు కాజేసిన వీబీకేపై చర్యలు తీసుకోండి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/28/27bng25-230002_mr-1738009189-0.jpg.webp?itok=uysDxFVw)
నిధులు కాజేసిన వీబీకేపై చర్యలు తీసుకోండి
సంఘం నిధులు కాజేసిన వీబీకేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వలిగొండ మండలం మొగలిపాక గ్రామానికి చెందిన నాగలక్ష్మి మహిళా సంఘం సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సంఘంలోని సభ్యులందరం కలిసి 2021లో రూ.10లక్షలు లోన్ తీసుకున్నామని, 24 నెలలు కిస్తులు చెల్లించాల్సి ఉందన్నారు. కిస్తు డబ్బులను నెలనెలా వీబీకేకు ఇచ్చామని, వాయిదాలు పూర్తయినప్పటికీ బ్యాంకు అధికారులు తమకు నోటీసులు పంపించారని పేర్కొన్నారు. బ్యాంకు అధికారులను సంప్రదించగా రూ.5.70 లక్షలు మాత్రమే చెల్లించారని, రూ.4.30 లక్షలు పెండింగ్ ఉందని చెప్పారు. విచారణ జరిపి వీబీకేపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment