రాయలసీమలో రాజధాని నిర్మిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రాయలసీమలో రాజధాని నిర్మిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధం

Published Fri, Jan 31 2025 1:08 AM | Last Updated on Fri, Jan 31 2025 1:08 AM

రాయలసీమలో రాజధాని నిర్మిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధం

రాయలసీమలో రాజధాని నిర్మిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధం

వేంపల్లె : కూటమి ప్రభుత్వం రాయలసీమలో రాజధాని నిర్మిస్తే అనుకూలమైన భూములు ఇచ్చేందుకు రాయలసీమ వాసులు సిద్ధంగా ఉన్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ పేర్కొన్నారు. గురువారం వేంపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి కోసం బురద నేలల్లో, గుంతల్లో ఎందుకు కష్టపడుతున్నారని, రాయలసీమ వాసులు కూడా హక్కు కలిగినవాళ్లమని, కనుక రాజధాని తమకు ఇవ్వాలని కోరారు. రాయలసీమకు ఓ చరిత్ర ఉందని, పెద్ద, పెద్ద సామ్రాజ్యాలు చూసిన ప్రాంతమన్నారు. రాయలసీమలోని ఏ జిల్లాలోనైనా రాజధానిని తెచ్చి పెడితే సహకరిస్తారని, కర్నూలులో బెంచ్‌ అవసరం లేదని, హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలకు నరేంద్ర మోదీ, అమిత్‌ షా అనుమతి ఉంది కదా ఎందుకు సీఎం చంద్రబాబు అంత దైన్యంగా మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ధైర్యంగా సూపర్‌ సిక్స్‌ పథకాలకు నిధులు మంజూరు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు నిలదీయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారి పోయిందని, గాడిలో పెట్టేందుకు కొంత సమయం పడుతుందని, అంత వరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేమని, ప్రజలపై పన్నుల భారం తప్పదని, సీఎం చావు కబురు చల్లగా చెప్పడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో పులివెందుల నియోజకవర్గం సమన్వయకర్త ధృవ కుమార్‌ రెడ్డి, అనంతపురం మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement