బ్యాంకర్ల సహకారం అవసరం
కడప సెవెన్‌రోడ్స్ : ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో బ్యాంకర్ల ఆర్థిక సహకారం ఉంటేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన యువ పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు లబ్ది చేకూర్చేలా రుణ సదుపాయాలు కల్పించాలన్నారు. సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని సూచించారు. జిల్లా లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ జనార్దనం, నాబార్డ్ ఏజీఎం విజయ విహారి, కెనరా బ్యాంకు ఏజీఎం మురళీ మోహన్, ఎస్‌బీఐ ఏజీఎం వాణీ కిషోర్ కుమార్ రెడ్డి, ఏపీజీబీ ఏజీఎం శ్రీనివాస ప్రసాద్, కేడీసీసీ సీఈఓ రాజామణి, డీఆర్డీఏ, మెప్మా పిడీలు ఆనంద్ నాయక్, సురేష్ రెడ్డి, ఎస్సీ, మైనారిటీ కార్పోరేషన్ ఈడీ డా. వి.బ్రహ్మయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ జయసింహ, పరిశ్రమల శాఖ జీఎం చాంద్ బాషా పాల్గొన్నారు.
బాలల సంక్షేమం.. ‘మిషన్ వాత్సల్య’ లక్ష్యం
అనాథ బాలల సంక్షేమం కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తున్నాయని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథక అమలు తీరు, బాల కార్మికులు, బాల్య వివాహాలు, అడాప్షన్, చిన్నపిల్లల భిక్షాటన వంటి వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల కార్మికుల నిర్మూలన కోసం లేబర్ డిపార్టుమెంటు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సమన్వయంతో జిల్లాలో ఎక్కడ బాల కార్మికులు ఎక్కువగా పని చేస్తున్నారు? ఏ కారణాల చేత వారు బాల కార్మికులుగా మారుతున్నారు? వంటి అంశాలపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వారికి మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఇచ్చే నాలుగు వేల రూపాలు సహాయం అందించి వారిని బడి బాట పట్టేలా పని చేయాలన్నారు. ప్రధానంగా లేబర్ శాఖ అధికారులు వ్యూహాత్మకంగా హోటల్స్, మెకానిక్ షాపుల పై నిరంతపు పర్యవేక్షణ వుంచి వారానికి నాలుగు సార్లు తనిఖీలు నిర్వహించాలన్నారు. చైల్స్ హెల్ప్ లైన్ 1098 సేవలు అందరికీ తెలిసేలా జిల్లాలో విరివిగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి,ఐసిడిఎస్ పిడి శ్రీలక్ష్మి, లేబర్ శాఖ అధికారి శ్రీకాంత్ నాయక్, జడ్పీ సీఈవో ఓబులమ్మ, పంచాయతీ రాజ్ శాఖ అధికారిని రాజ్యలక్ష్మి, డీఎస్పీ రమాకాంత్, విద్యా శాఖ, మిషన్ వాత్సల్య సిబ్బంది పాల్గొన్నారు.
ప్రత్యేక డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment