6న బి.మఠంలో బహిరంగ వేలం
బ్రహ్మంగారిమఠం : ఫిబ్రవరి 6న బ్రహ్మంగారిమఠం దేవస్థానం పరిధిలో బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు మఠం మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. భక్తులు సమర్పించుకునే తలనీలాలు, పోలేరమ్మ దగ్గర టెంకాయల అమ్మకం, కొబ్బెర చిప్పల సేకరణ, మరుగుదొడ్ల నిర్వహణ, పాదరక్షలు భద్రపరచుట, దేవస్థానం పరిధిలో పుస్తకాల విక్రయం వంటివాటికి బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ వేలంలో పాల్గొనదలచినవారు ఉద యం 9 గంటలకు తలనీలాల కోసం రూ.25 లక్షలు, పోలేరమ్మ గుడిదగ్గర టెంకాయల అమ్మకానికి రూ.1లక్ష, కొబ్బెర ముక్కల వసూ ల్‌కు రూ.75వేలు, మరుగుదొడ్ల నిర్వహణకు రూ.50వేలు, పుస్తకాల విక్రయానికి రూ.1లక్ష నగదుతో వేలానికి రావాలని సూచించారు.
వైద్య సేవల్లో జిల్లాకు ‘ఏ’ గ్రేడ్
కడప రూరల్: ప్రతినెల ప్రగతి నివేదికలో భాగంగా డిసెంబర్ మాసానికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు రాష్ట్ర స్థాయిలో ఏ గ్రేడ్ వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు అభినందనలు తెలిపారు. వైద్య సేవల్లో జిల్లా మొదటి స్థానంలో వచ్చేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని వివరించారు.
మద్యం దుకాణాలకు
దరఖాస్తుల ఆహ్వానం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం గీత కులాలకు చెందిన వారి కి కేటాయించిన 14 మద్యం దుకాణాలకు గాను కడప ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌కు కేటాయించిన మూడు దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలని కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కృష్ణకుమార్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ స్టేషన్ పరిధిలో కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో –ఈడిగ, చింతకొమ్మదిన్నె–గౌడ, ఖాజీపేట–గౌడ్ కులాలకు ప్రభుత్వం కేటాయించిందన్నారు. దరఖాస్తు దారులు ఆన్‌లైన్, ఆప్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దర ఖాస్తు ఫీజు రూ. 2లక్షలని వివరించారు. దరఖాస్తు దారులు ఫిబ్రవరి 5న సాయంత్రం 5 లోపల దరఖాస్తు చేసుకోవాలన్నారు. 7న కలెక్టరేట్ సభాభవన్‌లో డ్రా ఉంటుందన్నారు.
అసంఘటిత కార్మికుల నమోదు
కడప సెవెన్‌రోడ్స్ : ఈ–శ్రమ్ పోర్టల్‌లో జిల్లాలోని అసంఘటిత కార్మికుల నమోదుపై కలెక్టర్ శ్రీధర్ గురువారం సమీక్షించారు. జిల్లాలో 7,50,000 మందిని నమోదు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు వివిధ అసంఘటిత రంగాలకు సంబంధించి 3,66,162 మందిని నమోదు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్నిశాఖల సమన్వయంతో మిగిలిన లక్ష్యాలను పూర్తిచేయాలని ఉప కార్మిక కమిషనర్‌ను ఆదేశించారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు కార్మిక సెస్సును భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు జమ చేయాలని చెప్పారు.
11వ బెటాలియన్
కమాండెంట్‌గా ఆనందరెడ్డి
కడప అర్బన్ : భాకరాపేటలోని ఏపీఎస్‌పి 11వ బెటాలియన్ కమాండెంట్ కె. ఆనందర్‌రెడ్డిని నియమిస్తూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు పోలీసు అధికారులను బదిలీ చేశారు. ఇందులో భాగంగా కొన్ని రోజులుగా ఖాళీగా ఉన్న 11 బెటాలియన్ కమాండెంట్ పోస్టును ఆనంద్‌రెడ్డితో భర్తీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment