వల్లూరు పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
వల్లూరు : మండల కేంద్రమైన వల్లూరు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా గురువారం వల్లూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదులపై సరైన రీతిలో క్షుణ్ణంగా విచారణ జరిపి నిర్దిష్ట సమయంలో పరిష్కరించాలన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. వృత్తి పరమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే వాటిని పరిశీలించి పరిష్కరిస్తానని ఎస్పీ భరోసా ఇచ్చారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. నేరాలు జరగకుండా పగలు, రాత్రి ముమ్మరంగా గస్తీ నిర్వహించాలని సూచించారు. పాత నేరస్థులు, సస్పెక్టెడ్స్ల కార్యకలాపాలపై నిఘూ ఉంచాలన్నారు. వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను త్వరగా డిస్పోజ్ చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ మండలం పరిధిలో దక్షిణ కాశీగా పిలవబడే పుష్పగిరి క్షేత్రం ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఐ ఎస్కే రోషన్‌కు సూచించారు. జిల్లా ఎస్పీ వెంట కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ దారెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment