
పది పరీక్షకు 4326 మంది హాజరు
కడప ఎడ్యుకేషన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా శనివారం జరిగిన ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2 (కంపోసిట్ కోర్సు), ఏఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1(సంస్కృతం, అరబిక్, పర్శియస్) పరీక్షలు జిల్లావ్యాప్తంగా 99 పరీక్షా కేంద్రాల్లో జరిగాయి. 4346 మంది విద్యార్థులకుగాను 4326 మంది హాజరుకాగా 20 మంది గైర్హాజరయినట్లు డీఈఓ షంషుద్దీన్ తెలిపారు. జిల్లాలో 6 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 33 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా తాను మూడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశానని వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని డీఈఓ తెలిపారు.
నేడు కడపలో షేర్
మార్కెట్‌పై ఉచిత సదస్సు
కడప కోటిరెడ్డిసర్కిల్: కడప నగరం హరిత హోటల్‌లో ఆదివారం ఉదయం 11, మధ్యాహ్నం 3, రాత్రి 7 గంటలకు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వయిజర్ కె.కృష్ణకై లాస్ ఒక ప్రకటనలో తెలిపారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు ఎలా పెట్టాలి? భవిష్యత్తు అవసరాలకు ఇన్వెస్ట్ ఎలా చేస్తే లాభాలు పొందవచ్చు? అనే అంశాలపై ఆర్థిక రంగంలోని నిపుణుల ద్వారా తెలుసుకుని న్యాయపరంగా ఆదాయాన్ని ఎలా పెంచుకోవచ్చనే అంశాలను చర్చిస్తామని పేర్కొన్నారు.
మహిళల్లో రక్తహీనత
నివారణకు కృషి చేద్దాం
బద్వేలు అర్బన్: మహిళల్లో రక్తహీనత నివారణకు వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని వైద్య, ఆరోగ్యశాఖ జిల్లా గణాంక అధి కారి డాక్టర్ ఎ.రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని కొంగలవీడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. జిల్లా పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ అరుణకుమారి, డీపీఎంఓ నారాయణ, వైద్య సిబ్బంది రాజశేఖర్, జాకోబ్, వెంగయ్య, చంద్రావతి, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment