డ్రైవర్‌పై దాడి చేసి.. కారును దొంగిలించారు
కడప అర్బన్ : హైదరాబాదు నుంచి కడపకు ఇన్నోవా కారును బాడుగకు తీసుకుని వచ్చి డ్రైవర్‌పై దాడి చేసి.. కారును దొంగిలించిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో మైనర్ బాలుడు ఉన్నాడు. మంగళవారం కడప డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు చిన్న చౌక్ సీఐ ఓబులేసు, ఎస్‌ఐలు రాజరాజేశ్వర్ రెడ్డి, రవికుమార్‌లతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. కడపకు చెందిన నూరుల్లా అలియాస్ నూర్, తాజుద్దీన్ అలియాస్ తాజ్ హైదరాబాదుకు వెళ్లి ఈనెల 15న రాత్రి ఇన్నోవా కారును కడపకు బాడుగకు మాట్లాడుకొని వచ్చారు. ఈనెల 16వ తేదీన కడప రింగ్ రోడ్డు వద్దకు రాగానే కారు డ్రైవర్‌పై దాడి చేసి అతని మెడలోని బంగారు గొలుసు, వెండి ఉంగరాలను దోచుకుని కారుతో నిందితులు పరారయ్యారు. కారు డ్రైవర్ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో కడపకు చెందిన పఠాన్ మర్ఫాద్ ఖాన్ అలియాస్ హోంవర్కర్ అలియాస్ లడ్డు మరో బాల నేరస్తునితో కలిసి డ్రైవర్ శ్రీకాంత్‌ను కొట్టి అతని వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, మెడలో ఉన్న బంగారు గొలుసు, వెండి ఉంగరాలు తీసుకొని కారుతో పరారైనట్లు గుర్తించారు. జిల్లా ఎస్పీ ఈ.జీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సీఐ ఓబులేసు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులపై నిఘా ఉంచారు. వాటర్ గండి రోడ్డులో కడప నకాష్‌కు చెందిన పఠాన్ మర్ఫాద్ ఖాన్ అలియాస్ హోంవర్కర్ అలియాస్ లడ్డును అరెస్ట్ చేశారు. మరో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు నూరుల్లా అలియాస్ నూర్, తాజుద్దీన్ అలియాస్ తాజ్‌లు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు ఒకరిని రిమాండ్‌కు తరలించారు. మరొకరిని పరిశీలనకు పంపించారు.
ఇద్దరి అరెస్టు.. నిందితుల్లో ఒకరు మైనర్
పరారీలో ఇరువురు ప్రధాన నిందితులు
వివరాలు వెల్లడించిన కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు
Comments
Please login to add a commentAdd a comment