బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్
వేంపల్లె : స్థానిక వేంపల్లె నాలుగు రోడ్ల కూడలిలోని కడప రోడ్డులో ఉన్న బెంగళూరు బేకరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. దీంతో స్వీట్లకు సంబంధించిన మెటీరియల్, మిషనరీ దగ్ధమైంది. సంతోష్ కుమార్ అనే వ్యక్తి బతుకు దెరువు కోసం వృషభాచలేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన వాణిజ్య గదుల్లో బెంగళూరు బేకరీని నిర్వహిస్తున్నారు. రోజూ లాగే షాపునకు బీగాలు వేసి ఇంటికి వెళ్లారు. అయితే మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో బేకరీలో నుంచి దట్టమైన పొగలు రావడంతో సమీపంలో ఉన్న దుకాణఱదారుడు నాగ సుబ్బారావు చూసి బేకరీ యాజమాని సంతోష్ కుమార్ కు సమాచారమిచ్చారు. అలాగే అగ్నిమాపక శాఖకు ఫోన్ ద్వారా సమాచారమివ్వడంతో హుటాహుటిన అగ్నిమాపక శాఖాధికారి శివరామిరెడ్డి సంఘటన స్థలం వద్దకు తన సిబ్బందితో చేరుకుని మంటలను అదుపు చేశారు. బేకరీలోనే స్వీట్లు తయారీ చేస్తుండడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వచ్చినట్లు ఫైర్ అధికారి తెలిపారు. అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment