రామ మందిరం..సాహితీ సౌరభం | - | Sakshi
Sakshi News home page

రామ మందిరం..సాహితీ సౌరభం

Published Mon, Apr 7 2025 12:52 AM | Last Updated on Mon, Apr 7 2025 12:52 AM

రామ మ

రామ మందిరం..సాహితీ సౌరభం

ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండ రామయ్య సేవలో ఎందరో కవులు పుణీతులయ్యారు. అమూల్య ఆధ్యాత్మిక రచనలను రామయ్యకు అంకితం చేశారు. అయ్యలరాజు తిప్పయ్య క్రీ.శ. 1440లో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒంటిమిట్ట రఘువీర జానకీ నాయక మకుటంతో ఆయన వెలువరించిన శతకం లభ్యమైంది. తొలుత రాచరిక పాలనలో తన పాండిత్యాన్ని సాగించినప్పటికీ తరువాత పూర్తిగా దాశరథి సేవకు అంకితమయ్యారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రామయ్య సేవలో తరించిన కవులపై కథనం.

చమత్కార శైలి.. విభిన్నం

అయ్యలరాజు రామభద్రుడు ఒంటిమిట్టలో క్రీ.శ. 1550లో ఇక్కడ నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రామాభ్యుదయం కావ్యం ఆయన కలం నుంచి జాలువారింది. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడు రామరాయల మేనల్లుడు గొబ్బూరి నరసరాజుకు ఈ కావ్యాన్ని అంకితం చేశారు. రామాభ్యుదయం 8 ఆశ్వాసాల గ్రంధం. రామభద్రుని కవిత్వంలో చమత్కారం తొణికిసలాడుతుంది.

చరిత్రపుటలలెక్కని కవి నల్లకాలువ అయ్యప్ప..

చరిత్ర పుటలలెక్కని కవి నల్లకాలువ అయ్యప్ప..

వరకవి నల్లకాలువ అయ్యప్ప కోదండ పాణిని సేవించి వర కవి అయ్యారు. చంద్రగిరిని పాలించిన రెండో వెంకటపతి రాయల బావమరిది కుమారుడు ఓబరాజు. ఈయన సర్వసైన్యాధ్యక్షుడిగా సేవలందిచారు. ఆయనను ప్రసన్నం చేసుకుని అయ్యప్ప కృతులు చెప్పారు. నెల్లూరు జిల్లా భీమవరం గ్రామాన్ని అగ్రహారంగా పొందారు. పూర్వం నెల్లూరు నుంచి తిరుపతి వరకు దాడులు జరిగాయి. బద్వేలు, నందలూరు, రాజంపేట, కోడూరు, మామండూరు ప్రాంతాల మీదుగా దాడులు చేశారు. ఈ ఘటనలన్నింటిని నిర్భయంగా శతక రూపంలో అద్భుతమైన పద్యాలతో ఆవిష్కరించారు. ఆ శతకమే ‘శతృసంహార వెంకటాచల విహార’

సాహితీ మణి మకుటం

మట్లిరాజులు సిద్దవటం కేంద్రంగా పరిపాలన చేశారు. వీరు రామయ్య క్షేత్రాన్ని వైభవోపేతంగా తీర్చిదిద్దారు. గుడి నిర్మాణ సమయంలో ఉప్పు గొండూరు వెంకట కవి తరచూ సందర్శన నిమిత్తం ఇక్కడకి వచ్చేవారు. ఆ సమయంలోనే ఏకశిలానగరి రామయ్య మీద దశరథరామ అనే మకుటంతో శతకం రాశారు.

రామయ్యను దర్శించిన అన్నమయ్య

కోదండ రామస్వామిని పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. నేటికి ఈ ప్రాంత ప్రజలకు ఆ కీర్తనలు సుపరిచితం.

కోదండపాణి సేవలో పునీతులైన కవులు

భాగవతం రచించిన బమ్మెర పోతన

వాసుదాసు వాల్మీకి

రామాయణం అంకితం

అపర భక్తుడు మాల ఓబన్న

రాముడికే అంకితం చేశారు. వావిలి కొలను సుబ్బారావు

వావిలి కొలను సుబ్బారావు(వాసుదాసు) తన యావదాస్తిని రాముడికి అంకితం చేశారు. వా ల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. కుమారాభ్యుదయం, కౌసల్యా పరిణయం రాశారు. 1908 అక్టోబర్‌ 9, 10, 11 తేదీలలో రామాయణం గ్రంథాన్ని రాముడికి అంకితం ఇచ్చారు.

అక్షర హాలికుడు పోతన

వ్యాస మహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని బమ్మెర పోతన తెలుగులో రాశారు. మహావిష్ణువును శ్రీరాముడిగా ఆదరించి తరించిన అపర భక్తుడు. భాగవతం రచన చేసి జగదభిరాముడి చరణానికి అంకితం చేశారు. ఇక్కడి నేల తల్లితో మమేకమై అక్షర సేద్యం చేసి హాలికుడిగా ఆయన ప్రత్యేకతను చాటారు. అమూల్య సాహితీ గ్రంథాలను తనకు అంకితమివ్వమని రాజులు అడిగితే అందుకు ఆయన అంగీకరించ లేదు.

ఆయనది సడలని భక్తి భావం

రామాలయం తూర్పు దిశలో మాలకాటిపల్లె గ్రామం ఉంది. ఈ ఊరికి చెందిన భవనాసి మాల ఓబన్న జీవిత లక్ష్యం శ్రీరామచంద్రునిపై సడలని భక్తి భావం. ఆయన అమృత కంఠంతో నిరుపమాన రామకీర్తనలు పాడారు. పగటి పూట పనులు చేసుకుని రాత్రి పూట గుడికి ఎదురుగా ఉన్న సోపానాల ముందు కూర్చుని భజన పాటలు గానం చేసేవారు. బాగా పొద్దుపోయిన తరువాత ఇంటికి వెళ్లేవారు. ఒక రోజు సాయంత్రం రామయ్య దర్శనం కోసం తహసీల్దార్‌ వచ్చారు. ఆయన రావడాన్ని ఓబన్న గమనించలేదు. ఆధ్యాత్మికంగా అనురక్తితో లీనమై గానామృతం చేస్తూనే ఉన్నారు. దారికి అడ్డు తొలగలేదని తహసీల్దార్‌ ఆయనను దూషించారు. అదే రాజు రాత్రి తహసీల్దార్‌కు కలలో రాముడు కనిపించి భక్తుడిపై దూకుడు ప్రదర్శన మంచిది కాదని హితబోధ చేశారట. ఆ మరుసటి రోజు అధికారి ఓబన్న చెంతకు వచ్చి పొరపాటు జరిగిందని చింతించారు. భవనాసి పట్టుదల, భక్తిభావాన్ని చూసి మెచ్చుకున్నారు. నేటి పాలకులు మాల ఓబన్న సేవలను గుర్తించలేదు. ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని భక్తుల ఆవేదన.

రామ మందిరం..సాహితీ సౌరభం 1
1/3

రామ మందిరం..సాహితీ సౌరభం

రామ మందిరం..సాహితీ సౌరభం 2
2/3

రామ మందిరం..సాహితీ సౌరభం

రామ మందిరం..సాహితీ సౌరభం 3
3/3

రామ మందిరం..సాహితీ సౌరభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement