
ప్రతి రైతుకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు
పులివెందుల రూరల్ : భూమి ఉన్న ప్రతి రైతుకు ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వాలని జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు సిబ్బందికి సూచించారు. సోమవారం పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సభా భవనంలో పులివెందుల, ముద్దనూరు వ్యవసాయ డివిజన్ల పరిధిలోని 9మండలాల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్యను ఇవ్వడం ద్వారా వ్యవసాయ సేవలను సులభతరం చేయడంతో పాటు పారదర్శకంగా ఉంటాయన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ రైతులకు కావలసిన నాణ్యమైన ఎరువులను, విత్తనాల ను అందిస్తూ రైతుకు సేవ చేసే దానిలో ఎల్లప్పుడూ ముందు ఉండాలన్నారు. రైతులు సబ్సిడీ యంత్ర పరికరాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారి ఎ. నాగేశ్వర రావు