
కూటమి ప్రభుత్వం మానవత్వం మరిచింది. పేదల ఉచిత వైద్య సేవన
కడప రూరల్ : పేదలకు అందించే ఉచిత వైద్యం నిలిచిపోయింది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ట్రస్ట్ ద్వారా నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. ‘ఇన్నాళ్లు అప్పులు తెచ్చి ఆసుపత్రులను నడిపాం. ఇకపై ముందుగు సాగలేమ’ని ఆషా (ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేన్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి తెలిపింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్య శ్రీ) పథకం ద్వారా పేదలకు అందించే ఉచిత వైద్య సేవలను నిలుపుదల చేశారు.
పాపం.. ప్రజలు..
జిల్లా వ్యాప్తంగా నెట్ వర్క్ ఆసుపత్రులు మొత్తం 108 ఉన్నాయి. అందులో 36 ప్రైవేట్ ఆసుపత్రులు. మిగిలినవి ప్రభుత్వ ఆసుపత్రులు. ఈ ఆసుపత్రుల ద్వారా అర్హులకు 3,255 రకాల వ్యాధులకు వైద్య సేవ లు అందించాలి. ప్రతి రోజు దాదాపు 2 వేల మంది రోగులు ఆసుపత్రులకు వస్తుంటారు.కాగా 36 ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోవడంతో, వైద్యం కోసం వచ్చిన పేదలు ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రుల్లో ఉండే వైద్య మిత్రలు వచ్చిన రోగులకు ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద చూసే వైద్య సేవలు లేవు. ఆసుపత్రుల వారు బంద్‌లో ఉన్నారని చెప్పి పంపించేస్తున్నా రు. ఈ సమాధానం విని రోగులు ఆశ్చర్యపోతున్నారు. బందా..ఎప్పుడూ లేదే..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ పథకం కింద ఔట్ పేషెంట్స్‌కు ఫీజు తీసుకోకుండా పేషెంట్‌ను చూడాలి. ఇన్ పేషెంట్స్‌కు అయితే ఉచితంగా వైద్య సేవలు అందించాలి. బంద్ కావడంతో ఔట్ పేషెంట్స్ డాక్టరుకు ఫీజులు చెల్లించి చూపించుకుంటున్నారు. ఆపదలో ఉన్న ఇన్ పేషెంట్స్‌గా అవసరమైన వ్యాధిగ్రస్తుల పరిస్థితి చాలా ఇబ్బందిగా మారింది. ప్రైవేట్‌గా చూపించుకోవాలంటే వేలు దాటి లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం నుంచి బెదిరింపులు..
నెట్ వర్క్ ఆసుపత్రులకు పెండింగ్ బకాయిలను చెల్లించి, పేదల వైద్యానికి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోంది. వైద్య సేవలను నిలుపుదల చేసిన ఆసుపత్రుల వివరాలను తెలపాలని ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలిసింది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా బెదిరింపు చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
‘ఎన్టీఆర్ వైద్య సేవ’లు బంద్
ఉచిత వైద్యం అందక పేదల ఇబ్బందులు
జిల్లా వ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా బకాయిలు
నిధులు అందకపోవడంతో వైద్య సేవలను
నిలుపుదల చేసిన నెట్ వర్క్ ఆసుపత్రులు
ఈ వ్యక్తి పేరు అంకన్న. వేముల మండలం, గొందిపల్లె వాసి. రెండు వారాల క్రితం బండి మీద నుంచి కింద పడి కాలుకు గాయమైంది. కుట్టు వేశారు. అప్పుడు ఉచితంగా వైద్య సేవలు అందాయి. ఇప్పుడు చెకప్ కోసం వచ్చారు. వైద్య సేవలను నిలుపుదల చేయడంతో డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ రోజు బంద్ ఉందంట. చాలా మంది వచ్చి వెనక్కి వెళ్లారు. ఉచితంగా వైద్య సేవలు అందకపోతే తమ లాంటి వారి పేదల పరిస్ధితి ఏమికావాలని అంకన్న ప్రశ్నించారు. ఉచిత వైద్యం అందకపోతే పేదల పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
బంద్ అంటే ఫీజు చెల్లించాను
కంటి సమస్యతో కడపకు వచ్చాను. ఆసుపత్రుల వారు ఆరోగ్య శ్రీ కింద అందించే వైద్య సేవలు బంద్ చేశారని చెప్పారు. చేసేదిలేక రూ.300 ఫీజు చెల్లించి డాక్టర్ వద్ద చూపించుకున్నాను. ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. – రామ్మోహన్, ముద్దనూరు.

కూటమి ప్రభుత్వం మానవత్వం మరిచింది. పేదల ఉచిత వైద్య సేవన

కూటమి ప్రభుత్వం మానవత్వం మరిచింది. పేదల ఉచిత వైద్య సేవన

కూటమి ప్రభుత్వం మానవత్వం మరిచింది. పేదల ఉచిత వైద్య సేవన

కూటమి ప్రభుత్వం మానవత్వం మరిచింది. పేదల ఉచిత వైద్య సేవన

కూటమి ప్రభుత్వం మానవత్వం మరిచింది. పేదల ఉచిత వైద్య సేవన