చిన్నారుల కోసం శిశుగృహలో సంప్రదించండి | - | Sakshi
Sakshi News home page

చిన్నారుల కోసం శిశుగృహలో సంప్రదించండి

Published Sat, Apr 12 2025 2:40 AM | Last Updated on Sat, Apr 12 2025 2:40 AM

చిన్న

చిన్నారుల కోసం శిశుగృహలో సంప్రదించండి

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడ ప రైల్వేస్టేషన్‌లో సాకేత్‌ (3), మల్లి (2) అనే చిన్నారు లు ఉన్నారని తెలియడంతో ఐసీడీఎస్‌ సీడీపీఓ, సూపర్‌వైజర్‌, మహిళా పోలీసులు చిన్నారులు తీసుకుని సీడబ్ల్యుసీ ఎదుట హాజరు పరిచామని ఐసీడీఎస్‌ పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మి శుక్రవారం తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే బాలల సంక్షేమ సమితిలో సంప్రదించి తీసుకు వెళ్లాలన్నారు.

బీసీలకు 52 శాతం

రిజర్వేషన్లు కల్పించాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : రాష్ట్రంలోని బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బహుజన సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన నిర్వహించకుండా వారి ఓట్లతో అధికారం చలాయిస్తూ తీవ్ర అన్యాయానికి పాల్పడుతున్నారని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గుర్రప్ప విమర్శించారు. చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబయ్య, డీఎస్‌ జయరాం, బీసీ రమణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి వేదిక అధ్యక్షుడు నారాయణ, సీఆర్‌వీ ప్రసాద్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయవర్దన్‌, పీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, పీఆర్‌ఎస్‌వైఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ శంకర్‌, నాగేంద్ర, దళిత మిత్ర సంఘం అధ్యక్షులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

న్యాయం చేయాలని

మహిళ వేడుకోలు

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : అన్నమయ్య జిల్లా రాజంపేట డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కానిస్టేబుల్‌ సంజీవరాయుడు సతీమణి బి.కృష్ణవేణి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. శుక్రవారం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ను కలిసి ఆమె వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఇటీవల రూ. 1.50 లక్షలు అప్పు చేశాడని, అప్పు ఇచ్చిన వారు ఇంటి వద్దకు వచ్చి డబ్బుల కోసం మాట్లాడుతుండడంతో భర్తను ప్రశ్నించగా తమ ఉన్నతాధికారికి డబ్బులు ఇచ్చానని తెలిపారన్నారు. చిన్నచిన్న తప్పులకు కూడా ఆ ఉన్నతాధికారి లంచాలు తీసుకుని తన భర్తను దుర్బాషలాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి

సింహాద్రిపురం : మండలంలోని అంకాలమ్మ గూడూరు సమీపాన పులివెందుల రోడ్డులో శుక్రవారం ట్రాక్టర్‌ ఢీకొని బైక్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా యాడికి మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన వెంకట్రాముడు అరటి కాయలను లారీల లోడు నింపే కూలి పని చేసుకుంటూ పులివెందులలో నివాసముంటున్నాడు. వెంకట్రాముడు తన స్వగ్రామంలో జాతర ఉండటంతో శుక్రవారం కూలి పని తొందరగా ముగించుకొని తన స్వగ్రామానికి బైకుపై వెళుతుండగా అంకాలమ్మ గూడూరు బలపనూరు గ్రామాల మధ్యలో ఎదురుగా ట్రాక్టర్‌ వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకట్రాముడు(38) మృత్యువాతపడ్డారు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.

అండర్‌–17 సెపక్‌ తక్రా

పోటీలకు ఏపీ జట్లు ఎంపిక

సాక్షి, అమరావతి : జాతీయ స్థాయి అండర్‌–17 ‘సెపక్‌ తక్రా’ పోటీలకు ఏపీ జట్లు ఎంపికై నట్లు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి జి.భానుమూర్తిరాజు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుంచి 21 వరకు మణిపుర్‌లోని ఇంఫాల్‌ శాయ్‌ సెంటర్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈజట్లకు కోచ్‌గా ఎస్‌. రమేష్‌ (ఎన్టీఆర్‌), బాలికల జట్టు మేనేజర్గా ఎం. సంతోషి కుమారి (కర్నూలు), బాయ్స్‌ టీమ్‌ మేనేజర్‌ డి.సుంకర రావు (కర్నూలు) వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా జట్లను సమగ్ర శిక్షా ఎస్సీడీ అభినందిస్తూ విజయంతో తిరిగిరావాలని ఆకాంక్షించారు.

చిన్నారుల కోసం  శిశుగృహలో సంప్రదించండి 1
1/2

చిన్నారుల కోసం శిశుగృహలో సంప్రదించండి

చిన్నారుల కోసం  శిశుగృహలో సంప్రదించండి 2
2/2

చిన్నారుల కోసం శిశుగృహలో సంప్రదించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement