
వైఎస్సార్‌సీపీ పీఏసీలో జిల్లా నేతలకు చోటు
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీలో జిల్లా నేతలకు చోటు కల్పించారు. కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషాలకు ఇందులో చోటు కల్పించారు. పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పీఏసీ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో 33 మంది సభ్యులుగా ఉన్నారు.
సమష్టి కృషితోనే విజయవంతం
కడప అర్బన్: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ ఘట్టమైన కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగడంపై జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సమష్టి కృషితోనే కల్యాణ ఘట్టం విజయవంతంగా ముగిసిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి చిన్న ఘటనకు తావులేకుండా చూసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, ఏపీఎస్పీ, సివిల్, ఏఆర్, ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది, జిల్లాలోని ఇతర విభాగాల సిబ్బందికి అభినందనలు తెలిపారు. పోలీస్ శాఖకు సహకరించిన ఇతర శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
నేడు మెడికల్ ఎంప్లాయీస్ సర్వసభ్య సమావేశం
కడప సెవెన్‌రోడ్స్: పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు కడప నబీకోటలోని కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్నామని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఎండీ మహబూబ్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కార్‌రావు, నాయకులు టీడీకే సాగర్, జంబారపు అహారోన్, ఎస్.బాబా సాహెబ్‌లతోపాటు అనంతపురం, కర్నూ లు, చిత్తూరు జిల్లాశాఖల అధ్యక్ష, కార్యదర్శులు హాజరు కానున్నారన్నారు. జిల్లాలోని యూనియన్‌కు చెందిన నాయకులు, ఉద్యోగులు హాజరు కావాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ పీఏసీలో జిల్లా నేతలకు చోటు