భారతీయుల సంపదపై రూపాయి దెబ్బ | rupee beats indian family wealth's | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 23 2016 6:52 AM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

డాలరు-రూపారుు కరెన్సీ కదలికల్లో వచ్చిన మార్పుల ఫలితంగా భారతీయుల కుటుంబ సంపద గతేడాదితో పోలిస్తే 2016లో 26 బిలియన్ డాలర్ల (0.8%) మేర తగ్గి మూడు లక్షల కోట్ల అమెరికన్ డాలర్లు (రూ.204 లక్షల కోట్ల రూపాయలు)గా ఉన్నట్టు ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల కంపెనీ క్రెడిట్ సూసీ పేర్కొంది. ఈ మేరకు క్రెడిట్ సూసీ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్‌ను రూపొందించింది. భారత్‌లో సంపద పెరుగుతున్నప్పటికీ ఇది అందరికీ అందడం లేదని స్పష్టం చేసింది. భారత్‌లో సంపద లేమి ఇప్పటికీ గణనీయంగానే ఉందని, 96 శాతం వయోజనుల సంపద 10 వేల డాలర్లు (రూ.6.8 లక్షలు) లోపే ఉందని తెలిపింది. కేవలం 0.3% ప్రజల వద్దే లక్ష డాలర్లు (రూ.68 లక్షలు) కంటే ఎక్కువ సంపద ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. వీరి సంఖ్య 24 లక్షలని తెలిపింది. ముఖ్యాంశాలివీ...

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement