చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. తినడానికి తిండి, ఉండడానికి ఇళ్లు కూడా లేని ఓ నిర్భాగ్యుడిపై నలుగురు యువకులు మద్యం మత్తులో తమ ప్రతాపం చూపించారు. ఇష్టానుసారంగా దాడి చేసి, అతని మర్మావయానికి నిప్పుపెట్టారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. చెన్నైలోని రంగరాజపురంలో ఇండియన్ బ్యాంక్ ఎదుట జూన్ 4న అర్థరాత్రి జాఫర్(50) అనే నిరాశ్రయుడు పడుకున్నాడు. అదే సమయంలో పీకల్లోతు మద్యం సేవించిన నలుగురు వ్యక్తులు అటుగా వచ్చారు. వాళ్లు మద్యం మత్తులో సోయిమరిచి ఇష్టానుసారంగా జాఫర్‌పై దాడికి దిగారు. అతని మర్మావయవానికి నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న మరో యువకుడు పైపుతో కూడా దాడి చేశాడు.
Published Thu, Jun 15 2017 7:17 PM | Last Updated on Thu, Mar 21 2024 6:28 PM
Advertisement
Advertisement
Advertisement